నరకయాతన అంటే ఇదేనేమో.. త్రుటిలో ప్రాణాపయం నుంచి బయటపడ్డ.. షావుకారు జానకి కూతురు
ప్రముఖ నటి షావుకారు జానకి కుమార్తె యజ్ఞప్రభ (76) చెన్నైలోని తన నివాసంలో కిందపడటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలి శస్త్రచికిత్స తర్వాత వీల్‌చైర్ ఉపయోగిస్తున్న ఆమె, టాయిలెట్‌కు వెళ్తుండగా కిందపడిపోయారు. తిరిగి లేవలేక, తలుపు తెరవలేకపోయారు. ఫోన్ ద్వారా బంధువుకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బంది ఇంటికి చేరుకుని తలుపు పగలగొట్టి ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు.
నటి షావుకారు జానకి కుమార్తె కింద పడి నరకయాతన అనుభవిస్తూ.. సాయం కోసం ఎదురు చూడడం ఇప్పుడు కోలీవుడ్‌లో షాకింగ్ గా మారింది. చెన్నైలోని OMR దురైపాక్కం పిళ్లైయార్ కోయిల్ స్ట్రీట్‌లోని ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో ప్రముఖ నటి షావుకారు జానకి కుమార్తె యజ్ఞప్రభ నివసిస్తున్నారు. ఆమె వయసు 76. పిల్లలేమో ఆమెరికాలో ఉంటున్నారు.యజ్ఞప్రభకు కాలు సమస్య ఉంది. కొన్ని రోజుల క్రితం శస్త్రచికిత్స కూడా ఈమె చేపించుకున్నారు. శస్త్రచికిత్స తర్వాత నడవలేకపోవడంతో ఆమె ఇంట్లో వీల్‌చైర్ వాడుతున్నారు. ఈ క్రమంలోనే యజ్ఙప్రభ ఇంట్లోని టాయిలెట్‌కు వెళ్తుండగా, కుర్చీలోంచి యజ్ఞప్రభ కింద పడిపోయారు. వీల్‌చైర్‌లోకి తిరిగి వెళ్లలేక, ఇంటి తలుపును తెరవలేక నరకయాతన అనుభవించారు. అంత బాధలోనూ ఫ్లోర్ పై పాకుతూ.. పక్కనే ఉన్న సెల్ ఫోన్ ద్వారా సమీపంలో నివసిస్తున్న బంధువును సంప్రదించి, జరిగిన విషయాన్ని చెప్పారు. ఆమె బంధువు సహాయం కోసం 112 అగ్నిమాపక విభాగానికి ఫోన్ చేయగా ఆమె ఇంటి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తలుపు పగలగొట్టి, నటి షావుకారు జానకి రక్షించారు. ఆసుపత్రికి తరలించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కావ్య – అనిరుధ్ పెళ్లి వేడుకకు.. ఒకే ఒక్క టాలీవుడ్ హీరోకే పిలుపు ..
Sachin Tendulkar: 53 ఏళ్ల వయసులోనూ ఫిట్‌గా సచిన్.. నేటికీ.. ఆ రెండింటికీ పూర్తిగా దూరం
ఏఐ చాట్‌బాట్‌తో జర భద్రం.. ఈ 5 విషయాలు అస్సలు టైప్ చేయొద్దు..
సందర్మాట్ కెనాల్ ఒడ్డున అరుదైన శ్వేతనాగు దర్శనం!
అడ్డంగా దొరికిపోయిన చైన్ స్నాచర్లు..ఆ తర్వాత ఊహించని సీన్
నడిరోడ్డుపై బోల్తాపడిన భారీ కంటైనర్.. తృటిలో తప్పిన బైకర్!
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!

