నీటి వృధాను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం పానీ యాప్ను తీసుకొచ్చింది. మీ పరిసరాల్లో నీళ్లు వృధా అవుతున్నట్లు గమనిస్తే, ఫోటో/వీడియో తీసి యాప్లో కంప్లైంట్ చేయవచ్చు. జలమండలి తక్షణమే చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్లో పెరుగుతున్న నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకొని ఇంకుడు గుంతల ఏర్పాటు, నీటి సంరక్షణ ఆవశ్యకతను ప్రభుత్వం నొక్కి చెబుతోంది. నీటిని ఆదా చేసే వాలంటీర్లకు సీఎం రేవంత్ రెడ్డి నుండి అభినందనలు కూడా లభిస్తాయి.