ప్రధానమంత్రి దీపావళి కానుకగా రూ.8000 ఇస్తున్నారంటూ వాట్సాప్లో వస్తున్న నకిలీ మెసేజ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ హెచ్చరించింది. ఈ లింక్లు క్లిక్ చేస్తే వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్ సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి మీ అకౌంట్ ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. అప్రమత్తంగా ఉండండి.