AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lenin OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘లెనిన్’.. అయ్యగారి వంద కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?

అయ్యగారి ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. అఖిల్ అక్కినేని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్, 100 కోట్ల కు పైగా కలెక్షన్లు సాధించిన 'లెనిన్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (ఆగస్టు 07) అర్ధరాత్రి నుంచే తెలుగుతో పాటు వివిధ భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది.

Lenin OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'లెనిన్'.. అయ్యగారి వంద కోట్ల సినిమాను ఎక్కడ చూడొచ్చంటే?
Lenin Movie
Basha Shek
|

Updated on: Aug 07, 2026 | 6:35 AM

Share

అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ విలేజ్ లవ్ స్టోరీ కమ్ రివేంజ్ థ్రిల్లర్ లో లేటెస్ట్ సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. భారీ అంచనాలతో జులై 10న థియేటర్లలో రిలీజైన లెనిన్ సినిమాకు మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములా అయిన విలేజ్ నేపథ్యంలో నడిచే స్టోరీ, అఖిల్ యాక్టింగ్, భాగ్యశ్రీ బోర్సే అందచందాలు, తమన్ పాటలు, బీజీఎమ్..ఇలా అన్నీ అంశాలు సమపాళ్లలో కుదరడంతో లెనిన్ సినిమా అఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు సుమారు రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో ఆడుతోన్న లెనిన్ సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. లెనిన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం (ఆగస్టు 07) అర్ధరాత్రి నుంచే అఖిల్ 100 కోట్ల సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

లెనిన్ సినిమా విషయానికి వస్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సుమారు రూ. 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించగా రూ. 100 కోట్లకు పైగానే కలెక్షన్లు వచ్చాయి. లెనిన్ సినిమాలో హీరో, హీరోయిన్లతో పాటు ఈశ్వరీ రావు, ప్రమోద్ పంజు, బ్రహ్మాజీ, రాంకీ, సునీల్, గెటప్ శ్రీను, శత్రు తదితరులు ఈ సినిమా లో ప్రధాన పాత్రలు పోషించారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. మరి థియేటర్లలో లెనిన్ సినిమాను మిస్ అయ్యారా? లేదా మళ్లీ చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

ఇవి కూడా చదవండి

జీ5 ఓటీటీలో లెనిన్ సినిమా స్ట్రీమింగ్..

లెనిన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us