AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: బ్యాట్‌ చూపిస్తూ పాక్ ప్లేయర్ నోటిదూల.. సెలైంట్‌గా ఇచ్చిపడేసిన మనోడు.. క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రివేంజ్

1996 World Cup Quarter Final Video: మైదానంలో ప్రదర్శించే అతి విశ్వాసం ఎంతటి నష్టాన్ని తెస్తుందో చెప్పడానికి ఈ ఘట్టమే ప్రత్యక్ష నిదర్శనం. టీమిండియా తోపు బౌలర్ ప్రసాద్ చూపించిన సైలెంట్ రివెంజ్ భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ ఓ ఐకానిక్ మూమెంట్‌గా మిగిలిపోతుంది.

Video: బ్యాట్‌ చూపిస్తూ పాక్ ప్లేయర్ నోటిదూల.. సెలైంట్‌గా ఇచ్చిపడేసిన మనోడు.. క్రికెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రివేంజ్
Venkatesh Prasad Vs Aamir Sohail Video
Venkata Chari
|

Updated on: Aug 07, 2026 | 8:51 AM

Share

Venkatesh Prasad vs Aamir Sohail: 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మైదానంలో భారత్ పాకిస్తాన్ పోరు రణరంగాన్ని తలపించింది. పాక్ ఓపెనర్ ఆమీర్ సోహైల్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి, బంతి తెచ్చుకోమంటూ వేలు చూపిస్తూ తీవ్రంగా నిందించాడు. మరుసటి బంతికే క్లీన్ బోల్డ్ చేసి ప్రసాద్ ఇచ్చిన నోరూయించే కౌంటర్ క్రికెట్ చరిత్రలోనే చిరస్మరణీయంగా నిలిచిపోయింది. ఈనెల 5న పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్న వెంకటేష్ ప్రసాద్‌కు.. నెటిజన్లు ఈ వీడియోతో మరోసారి ఆనాటి సీన్‌ను తలచుకుంటూ విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా దూసుకపోతుంది.

చిరస్మరణీయ పోరులో ఉత్కంఠ సీన్..

క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ పోరు ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే సాగుతుంది. 1996 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరిగింది. మ్యాచ్ ప్రారంభం నుంచి మైదానంలో వాతావరణం ఎంతో వేడిగా ఉంది. లహోర్ నుంచి వచ్చిన వార్తలు, స్టేడియంలో ఉన్న అభిమానుల కేరింతలు మ్యాచ్ ప్రాధాన్యతను రెట్టింపు చేశాయి. భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడానికి పాకిస్తాన్ ఓపెనర్లు దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. ముఖ్యంగా పాక్ కెప్టెన్ ఆమీర్ సోహైల్ ఆరంభం నుంచే భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

ఎక్కువమంది చదివింది: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

ఇవి కూడా చదవండి

గర్వంతో చేసిన స్లెడ్జింగ్.. మైదానంలో శ్మశాన నిశ్శబ్దం..

ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేయడానికి కర్ణాటక మీడియం పేసర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్‌కు వచ్చారు. ఆ ఓవర్‌లో ఒక బంతిని ఆమీర్ సోహైల్ ఆఫ్‌సైడ్ వైపు బౌండరీ లైన్ దాటించాడు. అంతటితో ఆగకుండా, తన బ్యాట్ చూపించి, వేలితో కవర్స్ దిశగా సైగ చేస్తూ ప్రసాద్ వైపు నడిచాడు. “మళ్లీ బంతిని అక్కడికే కొడతాను, వెళ్ళి తెచ్చుకో” అంటూ తీవ్రమైన వ్యాఖ్యలతో ఉసిగొలిపాడు. ఈ అనుకోని ఘటనతో చిన్నస్వామి స్టేడియం మొత్తం ఒక్కసారిగా నోరెళ్లబెట్టింది. భారత్ తరఫున ఆడుతున్న ప్రతి క్రికెటర్ మనసులో ఆక్రోశం నిండిపోయింది. ప్రసాద్ మాత్రం ఎలాంటి మాట మాట్లాడకుండా, శాంతంగా వెనక్కి నడిచారు. ఆ క్షణంలో ఆయన మనసులో రివెంజ్ జ్వాలలు రగులుకున్నాయి.

ఒకే ఒక్క డెలివరీ.. చెల్లాచెదురైన వికెట్లు..

కోపం, ఆవేశం ప్రదర్శించకుండా తన ఏకాగ్రతను బంతిపైనే ఉంచారు ప్రసాద్. మరుసటి బంతిని అద్భుతమైన ఇన్-స్వింగర్‌గా విసిరారు. పెరిగిన గర్వంతో దాన్ని మళ్లీ సరిహద్దులు దాటించాలనే ఆత్రుతలో సోహైల్ తీవ్రంగా విఫలమయ్యాడు. బంతి బ్యాట్‌ను దాటుకుని నేరుగా వికెట్లను చెల్లాచెదురు చేసింది. లెగ్ స్టంప్ గాలిలో ఎగిరిపడింది. ఆ క్షణంలో మైదానం ఒక్కసారిగా మార్మోగిపోయింది.

ఎక్కువమంది చదివింది: IND vs PAK: పాకిస్తాన్‌తో తలపడే భారత జట్టు ఇదే.. స్వ్కాడ్ నుంచి ఆ స్టార్ ప్లేయర్ ఔట్..!

మాటలతో కాదు.. ఆటతో చెప్పిన ఆల్ టైమ్ గ్రేట్ రివెంజ్..

వికెట్లు ఎగిరిపడగానే ప్రసాద్ ఆవేశంతో ఊగిపోయారు. గర్వంతో నోరు పారేసుకున్న సోహైల్‌ వైపు వేలు చూపిస్తూ “వెళ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చో” అని గర్జించారు. మాటలతో కాకుండా తన ఆటతోనే సరైన సమాధానం చెప్పిన ఈ ఘట్టం క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ రివెంజ్ మూమెంట్‌గా నిలిచిపోయింది. సోహైల్ వికెట్ పడటంతోనే మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ తర్వాత భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. తరాలు మారినా, దశాబ్దాలు గడిచినా భారత క్రీడాభిమానుల గుండెల్లో ఈ ఘట్టం ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us