AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఫిట్‌నెస్‌ లేకుండా ఎందుకు ఆడుతున్నావ్ బుమ్రా.. ఏడాది రెస్ట్ తీసుకో..!

Jasprit Bumrah Injury Update: బుమ్రా ఫిట్‌నెస్‌పై మాజీ దిగ్గజం ఘావ్రీ చేసిన హెచ్చరికలను భారత క్రికెట్ బోర్డు తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. రాబోయే కీలక సిరీస్‌లను దృష్టిలో ఉంచుకుని షమీ, భువనేశ్వర్ వంటి సీనియర్లను పునఃపరిశీలించడం ద్వారా బౌలింగ్ లైనప్‌ను బలోపేతం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఫిట్‌నెస్‌ లేకుండా ఎందుకు ఆడుతున్నావ్ బుమ్రా.. ఏడాది రెస్ట్ తీసుకో..!
Jasprit Bumrah Injury Update
Venkata Chari
|

Updated on: Aug 06, 2026 | 10:04 AM

Share

Jasprit Bumrah Injury Update: టీమిండియా ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తరుచూ గాయాల బారిన పడుతుండటంపై భారత మాజీ క్రికెటర్ కర్సన్ ఘావ్రీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బుమ్రా కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు క్రికెట్‌కు పూర్తిగా విరామం ప్రకటించాలని, ఆయన స్థానంలో మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తిరిగి జట్టులోకి తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రీడా ప్రపంచంలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

భారత క్రికెట్ జట్టుకు అన్ని ఫార్మాట్లలో తిరుగులేని విజయాలు అందిస్తున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డే నుంచి విశ్రాంతి తీసుకున్న ఆయన, ప్రభావ గాయం (impact injury) కోలుకోకపోవడంతో రాబోయే రెండు టెస్టుల సిరీస్‌కు కూడా దూరమయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్, రెండు ప్రపంచకప్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన కర్సన్ ఘావ్రీ బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదికూడా చదవండి: స్వ్కాడ్‌లో ఈ 15మంది ఉంటే చాలు.. వద్దన్నా 2027 వన్డే వరల్డ్ కప్ పట్టుకొచ్చేస్తారంతే..!

సగం ఫిట్‌నెస్‌తో ఆడటం అనర్థం.. ఏడాది విరామం మేలు..!

సగం ఫిట్‌నెస్‌తో పెద్ద పెద్ద టోర్నీలు, సిరీస్‌లలో బరిలోకి దిగి మధ్యలోనే గాయపడటం వల్ల బుమ్రాకు, జట్టుకు తీవ్ర నష్టం జరుగుతోందని ఘావ్రీ అభిప్రాయపడ్డారు. అరకొర ఫిట్‌నెస్‌తో ఆడటం వల్ల అనవసరమైన ఒత్తిడి పెరుగుతోందని స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

బుమ్రా ఐదారు నెలలు లేదా అవసరమైతే ఏకంగా ఒక ఏడాది పాటు క్రికెట్ నుంచి తప్పుకుని, వంద శాతం ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే జాతీయ జట్టులోకి పునరాగమనం చేయాలని సూచించారు. గత రెండేళ్లుగా బుమ్రా జట్టులోకి రావడం, గాయంతో బయటకు వెళ్లడం పరిపాటిగా మారిందని, ఏ ఒక్క పూర్తి సిరీస్ ఆడకపోవడం మంచి సంకేతం కాదని హెచ్చరించారు. ఇదికూడా చదవండి: రోహిత్‌నే తప్పిద్దామనుకున్నాడు.. కట్‌చేస్తే.. అగార్కర్ పోస్ట్‌కే చెక్ పెట్టేసిన హిట్‌మ్యాన్.. నెక్ట్స్ బాస్‌గా తెలుగోడే..?

షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తిరిగి జట్టులోకి తీసుకోవాలి..

బుమ్రా గైర్హాజరీలో భారత పేస్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు అనుభవజ్ఞులైన మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తిరిగి జట్టులోకి ఎంపిక చేయాలని బిసిసిఐ సెలెక్టర్లకు ఘావ్రీ విజ్ఞప్తి చేశారు. గత ఐపీఎల్ సీజన్లలో వీరిద్దరూ ఎలాంటి గాయాలు లేకుండా అద్భుతమైన ప్రదర్శన చేశారని గుర్తుచేశారు.

భువనేశ్వర్ కుమార్ అనుభవాన్ని పొట్టి ఫార్మాట్ అయిన టీ20లలో పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవచ్చని తెలిపారు. ఐపీఎల్‌లో భువీ బౌలింగ్ గణాంకాలు ఎంతో మెరుగ్గా ఉన్నాయని, టీ20 జాతీయ జట్టులో ఆయన ఉనికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఇదికూడా చదవండి: Rohit Sharma: రోహిత్ శర్మ ఎఫెక్ట్.. రెండుగా చీలిన బీసీసీఐ.. ప్రపంచకప్ 2027 రేసులో ఉంటాడా లేదా..?

టెస్టుల్లో షమీ, సిరాజ్‌ల రొటేషన్.. బుమ్రాపై తగ్గనున్న ఒత్తిడి..

బుమ్రా ఒకే సమయంలో టెస్టులు, వన్డేలు, టీ20లతో పాటు ఐపీఎల్ వంటి అన్ని ఫార్మాట్లలో ఆడటం ఆచరణాత్మకంగా సాధ్యం కాదని ఘావ్రీ విశ్లేషించారు. టెస్టు క్రికెట్ అత్యంత కీలకమైన ఫార్మాట్ కాబట్టి బుమ్రాను ప్రాధాన్యత ఆధారంగా టెస్టులకే పరిమితం చేయాలని మేనేజ్‌మెంట్‌కు సూచించారు. ఇదికూడా చదవండి: అమ్మాయిలతో జాగ్రత్త.. ఆ ఇద్దరిలా అస్సలు మారొద్దు.. వైభవ్ సూర్యవంశీకి మాజీ క్రికెటర్ హెచ్చరిక..!

టెస్టుల్లో మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీలను మార్చి మార్చి ఆడించడం వల్ల బౌలర్లపై పనిభారం తగ్గుతుందని తెలిపారు. సిరాజ్‌కు షమీ, భువీ లాంటి సీనియర్ల మద్దతు లభిస్తే భారత బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుందని, తద్వారా బుమ్రాపై ఉండే పనిభారం, ఒత్తిడి గణనీయంగా తగ్గుతాయని ఆయన వివరించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఏడాది రెస్ట్ తీసుకో బుమ్రా..!
ఆ ఇద్దరి ఉసురు తగిలిద్ది.. ఏడాది రెస్ట్ తీసుకో బుమ్రా..!
అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే..
అదృష్టమంటే ఇదేనా.. చెత్తబుట్టలో రూ.10.9 కోట్లు.. ఈ కథ తెలిస్తే..
OTTలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో...
OTTలో దుమ్మురేపుతోన్న నాగదుర్గ సినిమా.. ఇండియా వైడ్‌గా టాప్‌లో...
అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..
అసలు కంటే వడ్డీయే ఎక్కువ కడుతున్నారా.. హోమ్ లోన్ భారాన్ని..
విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?
విశాఖ రాథోడ్ మామూల్ది కాదు.. ఏం చేసిందో తెలుసా..?
స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..
స్టేజ్ పై చెంప మీద పదే పదే కొట్టుకున్న నటుడు..
వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
వెండి జ్యూవెలరీ కొనాలని అనుకుంటున్నారా? దేశంలోనే బెస్ట్ సిటీ ఇదే!
రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..
రాజమండ్రిలో ఘోరం.. మెడికోను కారుతో ఢీకొట్టిన యువకులు..
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
ట్రంప్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం..!అమెరికా అధ్యక్షుడు డొనాల్డ
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..
విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్ ఆసక్తికర కామెంట్స్..