AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: 20 సిక్స్‌లు, 17 ఫోర్లు.. 100 బంతుల్లో ఊచకోత.. బ్రదర్స్ ఆఫ్ బీభత్సం అనాల్సిందే భయ్యో..!

Sunrisers Leeds vs London Spirit: హెడింగ్లీ వేదికగా సన్‌రైజర్స్ లీడ్స్ సాధించిన ఈ భారీ విజయం 'ది హండ్రెడ్' లీగ్ స్థాయిని మరో ఎత్తుకు తీసుకెళ్లింది. రికార్డుల మయంగా మారిన ఈ లీగ్‌లో రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులు బద్దలవుతాయో చూడటానికి క్రీడాభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Video: 20 సిక్స్‌లు, 17 ఫోర్లు.. 100 బంతుల్లో ఊచకోత.. బ్రదర్స్ ఆఫ్ బీభత్సం అనాల్సిందే భయ్యో..!
Harry Brook, Mitchell Marsh, Ryan Rickelton Scores
Venkata Chari
|

Updated on: Aug 05, 2026 | 12:47 PM

Share

Sunrisers Leeds vs London Spirit: ది హండ్రెడ్ లీగ్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. లండన్ స్పిరిట్‌తో జరిగిన హోరాహోరీ పోరులో ఏకంగా 241 పరుగులు సాధించి లీగ్ చరిత్రలోనే ఆల్‌టైమ్ హయ్యెస్ట్ స్కోరు రికార్డును సొంతం చేసుకుంది. మిచెల్ మార్ష్, రయాన్ రికిల్టన్, హ్యారీ బ్రూక్ త్రయం జరిపిన ఊచకోతతో రికార్డులన్నీ బద్దలైపోయాయి.

ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్‌లో సన్‌రైజర్స్ లీడ్స్ బ్యాటర్లు జులుం విదిల్చారు. లండన్ స్పిరిట్ బౌలర్లపై తొలి బంతి నుంచి ఎదురుదాడికి దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 100 బంతుల్లో 241/2 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే అత్యధిక ఇన్నింగ్స్ స్కోరు కావడం విశేషం. మైదానంలో ప్రతి బంతిని బౌండరీ దాటించడమే లక్ష్యంగా ఆడిన సన్‌రైజర్స్ ఆటగాళ్లు లీడ్స్ ప్రేక్షకులకు నిజమైన టి20 వినోదాన్ని పంచారు. బౌలర్లు ఎన్ని రకాల వ్యూహాలు పన్నినా, వాటిని తిప్పికొడుతూ స్కోరు బోర్డును పరుగులు తీయించారు.

ఇవి కూడా చదవండి

మార్ష్, రికిల్టన్ విధ్వంసం.. మొదటి వికెట్‌కే కొండంత భాగస్వామ్యం..

ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆసీస్ స్టార్ మిచెల్ మార్ష్, దక్షిణాఫ్రికా ఆటగాడు రయాన్ రికిల్టన్ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డారు. మార్ష్ కేవలం 37 బంతుల్లోనే 76 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించగా, రికిల్టన్ 42 బంతుల్లో 94 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు నెలకొల్పిన భాగస్వామ్యం ఈ లీగ్ చరిత్రలోనే అతిపెద్ద రికార్డుగా నిలిచింది. లండన్ స్పిరిట్ బౌలర్ల వద్ద వీరి దాడిని అడ్డుకునేందుకు ఎలాంటి సమాధానం లేకుండా పోయింది.

15 బంతుల్లోనే ఫిఫ్టీ.. హ్యారీ బ్రూక్ మెరుపు ఇన్నింగ్స్..

ఓపెనర్లు వేసిన బలమైన పునాదిని ఇంగ్లాండ్ విధ్వంసకర బ్యాటర్ హ్యారీ బ్రూక్ నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. క్రీజులోకి అడుగుపెడుతూనే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన బ్రూక్, కేవలం 18 బంతుల్లోనే 55 పరుగులు బాదాడు. ఇందులో కేవలం 15 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకుని ది హండ్రెడ్ లీగ్‌లో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశాడు. అతని బ్యాటింగ్ ధాటికి ప్రత్యర్థి బౌలర్లు దిక్కుతోచక చేతులెత్తేశారు.

భారత అభిమానులకు ప్రత్యక్ష వినోదం..

ఈ సంచలన మ్యాచ్ విశేషాలను స్టార్ స్పోర్ట్స్ ఇండియా తన అధికారిక సామాజిక మాధ్యమ వేదికల్లో పంచుకుంటూ అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ లీగ్‌లోని మిగిలిన ఉత్కంఠభరిత పోరును భారత ప్రేక్షకులు ప్రతిరోజూ సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానళ్లతో పాటు జియోహాట్‌స్టార్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో చూడొచ్చు. అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్ల ఊచకోతను నేరుగా వీక్షించేందుకు క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us