AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లకు గుడ్ బై..!

Mumbai Indians released players IPL 2027: జట్టు ప్రయోజనాల కోసమే ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. రాబోయే ఐపీఎల్ మినీ వేలంలో ఈ మార్పులు చేసి ముంబై ఇండియన్స్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తుందో లేదో చూడాలి.

IPL 2027: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. ఆ ఐదుగురు స్టార్ ప్లేయర్లకు గుడ్ బై..!
Mumbai Indians Released Players Ipl 2027
Venkata Chari
|

Updated on: Aug 04, 2026 | 11:05 AM

Share

Mumbai Indians released players IPL 2027: ఐపీఎల్ చరిత్రలో అత్యంత సఫలమైన ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రాబోయే మినీ వేలం కోసం భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. పేలవ ప్రదర్శనతో తీవ్ర నిరాశ పరిచిన ఐదుగురు ప్రముఖ ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధమైంది. ఆ స్టార్ క్రికెటర్ల జాబితా, టీమ్ వ్యూహం వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ గత కొన్ని సీజన్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. మైదానంలో జట్టు వైఫల్యాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముందే జట్టులోని లోపాలను సరిదిద్దేందుకు యాజమాన్యం నడుం బిగించింది. రాబోయే సీజన్ కోసం పక్కా వ్యూహంతో అడుగులు వేస్తూ, భారీ ధర ఇచ్చి కొనుగోలు చేసినా ఫలితం లేకపోయిన ఐదుగురు క్రికెటర్లకు సాగనంపేందుకు రంగం సిద్ధం చేసింది.

ఇదికూడా చదవండి: Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!

ఇవి కూడా చదవండి

వదిలించుకునే జాబితాలో ఆ ఆల్ రౌండర్..

జట్టు విడుదల చేయబోయే ఆటగాళ్లలో ప్రధానంగా వెస్టిండీస్ ఆల్ రౌండర్ రొమారియో షెపర్డ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉందనే నమ్మకంతో జట్టులోకి తీసుకున్నప్పటికీ మ్యాచ్ విన్నర్‌గా అతను ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయాల్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడం మేనేజ్‌మెంట్‌కు ఆందోళన కలిగించింది. దీంతో అతడిని వదిలేసి వేలంలో మరొక విదేశీ ఆల్ రౌండర్‌ను దక్కించుకోవాలని యోచిస్తోంది.

స్పిన్ విభాగంలో మార్పులు తప్పవు..

అలాగే స్పిన్ బౌలింగ్ విభాగంలో ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయిన పీయూష్ చావ్లాతో పాటు శ్రేయస్ గోపాల్‌ను కూడా జట్టు నుంచి వేరు చేయాలని భావిస్తున్నారు. వయసు భారంతో చావ్లా వికెట్లు తీయడంలో తడబడుతుంటే, లభించిన అవకాశాలను గోపాల్ సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు. మిడిల్ ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని అడ్డుకునే పవర్‌ఫుల్ స్పిన్నర్ లేకపోవడం ముంబైకి పెద్ద మైనస్‌గా మారింది. ఈ స్థానంలో యువ స్పిన్ సంచలనాన్ని వేలానికి వెళ్లడమే ఉత్తమమని భావిస్తున్నారు.

ఇదికూడా చదవండి: Video: ఇలాంటి ఔట్ చూశారా.. బద్దకంతో వికెట్ పారేసుకున్న టీమిండియా ప్లేయర్.. ఎవరంటే?

మిడిల్ ఆర్డర్ కష్టాలు.. కొత్త రక్తంపై కన్ను..

పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న యువ బ్యాటర్ విష్ణు వినోద్‌తో పాటు పేసర్ అర్జున్ టెండూల్కర్‌ను కూడా రిలీజ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించడంలో విష్ణు వినోద్ విఫలమయ్యాడు. బౌలింగ్‌లో ఆశించినంత వేగం, వైవిధ్యం లేకపోవడంతో అర్జున్‌కు తుది జట్టులో స్థానం దక్కడం గగనంగా మారింది. ఈ ఐదుగురిని విడుదల చేయడం ద్వారా లభించే మిగిలిన పర్స్ మనీతో వేలంలో నాణ్యమైన ఆటగాళ్లను కొనుగోలు చేయవచ్చని ముంబై ఇండియన్స్ భావిస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us