AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!

Pakistan DRS blunder West Indies Test: క్రికెట్‌లో చిన్న చిన్న రివ్యూ నిర్ణయాలు కూడా మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తాయని ఈ సంఘటన మరోసారి నిరూపించింది. బాబర్ అజామ్ చేసిన ఈ డీఆర్‌ఎస్ బ్లండర్ ఫలితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో వేచి చూడాలి.

Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్.. వీడియో చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే..!
Pakistan Drs Blunder West Indies Test
Venkata Chari
|

Updated on: Aug 04, 2026 | 7:04 AM

Share

Pakistan DRS blunder West Indies Test: క్రికెట్ మైదానంలో పాకిస్థాన్ జట్టు చేసే చిత్ర విచిత్ర పొరపాట్లు అభిమానులను అవాక్కయ్యేలా చేస్తుంటాయి. వెస్టిండీస్‌తో జరుగుతున్న కీలక టెస్టు మ్యాచ్‌లో సులువైన వికెట్‌ను డీఆర్‌ఎస్ తీసుకోకుండా వదిలేసి పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ మళ్లీ నవ్వులపాలయ్యాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాలు ఇప్పుడు చూద్దాం..

పాకిస్థాన్ క్రికెట్ జట్టు మైదానంలో చూపే హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫీల్డింగ్ తప్పిదాలు, వికెట్ల మధ్య అయోమయం, రివ్యూ నిర్ణయాల్లో పొరపాట్లతో వార్తల్లో నిలవడం పాక్ ఆటగాళ్లకు అలవాటుగా మారింది. తాజాగా వెస్టిండీస్ పర్యటనలో భాగంగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మరో విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. తొలి మ్యాచ్ ఓడిపోయి ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల కోసం కష్టపడుతున్న వేళ, పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన చిన్న పొరపాటు వెస్టిండీస్ జట్టుకు కొండంత లబ్ధి చేకూర్చింది.

చేతికి వచ్చిన వికెట్.. డీఆర్‌ఎస్ తీసుకోని దారుణం..

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 87వ ఓవర్‌లో ఈ కామెడీ దృశ్యం ఆవిష్కృతమైంది. పాక్ స్పిన్నర్ అలీ ఉస్మాన్ వేసిన బంతి కరేబియన్ బ్యాటర్ కెమర్ రోచ్ ప్యాడ్లను బలంగా తాకింది. వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్, స్లిప్‌లో ఉన్న సల్మాన్ అగా స్వల్పంగా అప్పీల్ చేసినా, బౌలర్ ఉస్మాన్ పెద్దగా స్పందించలేదు. సెకండ్ స్లిప్‌లో నిలబడిన బాబర్ అజామ్ కీపర్‌తో మాట్లాడినప్పటికీ, డీఆర్‌ఎస్ రివ్యూ వైపు అసలు మొగ్గు చూపలేదు. తీరా పెద్ద స్క్రీన్ మీద బాల్ ట్రాకింగ్ రీప్లే వేసినప్పుడు ఆ బంతి నేరుగా లెగ్ స్టంప్‌ను ఎగరగొడుతున్నట్లు (త్రీ రెడ్స్) తేలింది. అది చూసిన కెమర్ రోచ్, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకోగా, బాబర్ తన తల పట్టుకుని బాధపడ్డాడు.

పాకిస్థాన్ కొంపముంచిన ఆ ఒక్క తప్పు..

బాబర్ అజామ్ చేసిన ఈ చిన్న పొరపాటు పాకిస్థాన్ జట్టుకు భారీగా నష్టం కలిగించింది. ఆ సమయంలో విండీస్ స్కోరు 277 పరుగుల వద్ద 6 వికెట్లుగా ఉంది. ఖాతా తెరవని రోచ్‌కు లభించిన ఆ ఒక్క లైఫ్ నాన్-స్ట్రైకర్ రోస్టన్ ఛేజ్‌కు బలాన్నిచ్చింది. సులువుగా ముగియాల్సిన విండీస్ తోకముడి ఇన్నింగ్స్ మరో 67 పరుగులు జోడించి మొత్తం 344 పరుగుల భారీ స్కోరు సాధించింది. రోచ్ ఆ తర్వాత 62 బంతులు ఎదుర్కొని 19 పరుగులు చేయడమే కాకుండా, విండీస్ ఇన్నింగ్స్ నిలదొక్కుకోవడానికి కీలక పాత్ర పోషించాడు.

సిరీస్ సమానం చేయడంపైనే బాబర్ ఆశలు..

మొదటి టెస్టు ఓటమి నుంచి కోలుకోవాలంటే పాక్ బ్యాటర్లు మొదటి ఇన్నింగ్స్‌లో కొండంత స్కోరు సాధించాల్సి ఉంది. బౌలింగ్‌లో సజిద్ ఖాన్ 4 వికెట్లతో రాణించినా, బ్యాటింగ్‌లో బాబర్ అజామ్, మహమ్మద్ రిజ్వాన్, ఇమామ్ ఉల్ హక్ బాధ్యతారాహిత్యంగా ఆడితే జట్టుకు కష్టాలు తప్పవు. టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో చివరి స్థానాల నుంచి గట్టెక్కాలంటే బాబర్ తన బ్యాట్‌తో జట్టును ముందుకు నడిపించక తప్పదు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
డాబర్‌కు ఎదురుదెబ్బ.. బయటపడిన నిజం.. ఉత్పత్తుల నిషేధం..!
డాబర్‌కు ఎదురుదెబ్బ.. బయటపడిన నిజం.. ఉత్పత్తుల నిషేధం..!
Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్..
Video: ఓరేయ్ ఆజామూ.. మరోసారి నవ్వులపాలైన పాక్ టీమ్..
వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..
వరుసగా 7 ఫ్లాపులు అయినా ఒక్క సినిమాకు రూ. 25 కోట్ల రెమ్యూనరేషన్..
తోటి పామును చంపిన రెండ్రోజులకే.. అన్నాచెల్లెల్లను కాటేసిన మరోపాము
తోటి పామును చంపిన రెండ్రోజులకే.. అన్నాచెల్లెల్లను కాటేసిన మరోపాము
నాయిస్ ట్విస్ట్ గో స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఇవే
నాయిస్ ట్విస్ట్ గో స్మార్ట్‌వాచ్ ప్రత్యేకతలు ఇవే
ఈ 4 మార్నింగ్ హ్యాక్స్‌తో మీ డేను ఫుల్‌ జోష్‌గా మార్చేసుకోవచ్చు!
ఈ 4 మార్నింగ్ హ్యాక్స్‌తో మీ డేను ఫుల్‌ జోష్‌గా మార్చేసుకోవచ్చు!
అమ్మడూ ఇది నీవేనా? ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
అమ్మడూ ఇది నీవేనా? ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
బూట్‌ స్పేస్ సహా సీఎన్‌జీ సెటప్‌తో బ్రెజా.. ప్రత్యేకతలివే
బూట్‌ స్పేస్ సహా సీఎన్‌జీ సెటప్‌తో బ్రెజా.. ప్రత్యేకతలివే
భారత్‌లో హోండా కొత్త వ్యూహం.. ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో హోండా కొత్త వ్యూహం.. ప్రత్యేకతలు ఇవే
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తుల
భారీగా దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తుల