AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: రోహిత్‌ను హిట్‌మ్యాన్‌గా మార్చిన మ్యాచ్ గుర్తుందా.. సూపర్ ఓవర్‌లో చించేశాడు భయ్యో..!

Rohit Sharma Hitman Moment: రోహిత్ శర్మ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన ఈ సూపర్ ఓవర్ విజయం ఇప్పటికీ ప్రతి భారతీయ అభిమాని గుండెల్లో పసిడి జ్ఞాపకంగా నిలిచిపోయింది. క్లిష్ట సమయాల్లో జట్టును ఒంటిచేత్తో గెలిపించే అతని అపారమైన సామర్థ్యమే రోహిత్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ వైట్ బాల్ బ్యాటర్‌గా నిలబెట్టింది!

Video: రోహిత్‌ను హిట్‌మ్యాన్‌గా మార్చిన మ్యాచ్ గుర్తుందా.. సూపర్ ఓవర్‌లో చించేశాడు భయ్యో..!
Rohit Sharma Turn Into Hitman Moment
Venkata Chari
|

Updated on: Aug 03, 2026 | 12:55 PM

Share

Rohit Sharma Hitman Moment: టీమిండియా క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన సూపర్ ఓవర్ థ్రిల్లర్‌లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ సృష్టించిన సునామీ నెటిజన్లను ఊపేస్తోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో చివరి రెండు బంతుల్లో విజగానికి 10 పరుగులు అవసరమైన దశలో రోహిత్ కొట్టిన బ్యాక్ టు బ్యాక్ బాహుబలి సిక్సర్లు భారత క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయాయి!

ఈ మ్యాచ్‌లో తొలుత నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి ఇరు జట్ల స్కోర్లు సమమవ్వడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. భారత్ తరఫున డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ జస్ప్రీత్ బుమ్రా సూపర్ ఓవర్ బౌలింగ్ వేసేందుకు రంగంలోకి దిగాడు. అయితే న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్, మార్టిన్ గుప్తిల్‌లు బుమ్రా బౌలింగ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఒక ఫోర్, ఒక భారీ సిక్సర్‌తో విరుచుకుపడి న్యూజిలాండ్‌కు ఏకంగా 17 పరుగుల కొండంత స్కోరును అందించారు. దీంతో భారత్ విజయం సాధించాలంటే 6 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన కఠినమైన పరిస్థితి ఏర్పడింది.

ఇది కూడా చదవండి: బుమ్రా, స్టార్క్ కాదు.. నేను భయపడే బౌలర్ ఎవరంటే.. వైభవ్ సూర్యవంశీ మాస్ స్టేట్‌మెంట్..!

ఇవి కూడా చదవండి

సౌథీ బౌలింగ్.. కట్టుదిట్టమైన ఆరంభం..

18 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జోడీ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్‌లకు న్యూజిలాండ్ అనుభవజ్ఞుడైన పేసర్ టిమ్ సౌథీ కట్టడి చేసేందుకు ప్రయత్నించాడు. తొలి బంతికి రెండు పరుగులు, 2వ బంతికి సింగిల్, మూడవ బంతికి కేఎల్ రాహుల్ ఫోర్ కొట్టినా, నాలుగో బంతికి సింగిల్ రావడం వల్ల మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల దాటిపోయినట్లే కనిపించింది. చివరి 2 బంతుల్లో భారత్ గెలవడానికి ఏకంగా 10 పరుగులు అవసరమయ్యాయి. మైదానంలోని ప్రేక్షకులతో పాటు కోట్లాది మంది అభిమానులు గుండెలు చేతుల్లో పట్టుకుని మ్యాచ్‌ను వీక్షించారు.

చివరి రెండు బంతులు.. హిట్‌మ్యాన్ విశ్వరూపం..

ఆ సమయంలో క్రీజులో ఉన్న రోహిత్ శర్మ ఏమాత్రం ఒత్తిడికి గురికాకుండా తన వద్ద ఉన్న అనుభవాన్ని ఉపయోగించాడు. ఐదో బంతిని సౌథీ ఫుల్ టాస్ గా విసిరగా, రోహిత్ దాన్ని లాంగ్ ఆఫ్ మీదుగా గాల్లోకి లేపి మైదానం దాటించి భారీ సిక్సర్‌గా మలిచాడు. దీంతో చివరి బంతికి 4 పరుగులు కావాల్సిన ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. తీవ్ర ఒత్తిడిలో ఉన్న సౌథీ ఆఖరి బంతిని యార్కర్ వేసేందుకు ప్రయత్నించి ఆఫ్ సైడ్ వైపు వేయగా, రోహిత్ శర్మ అద్భుతమైన టైమింగ్‌తో కవర్స్ మీదుగా మరో వీరోచిత సిక్సర్ బాదాడు. దీంతొ భారత్ సూపర్ ఓవర్‌లో ఉత్కంఠ విజయం సాధించింది.

కోహ్లీ సంబరాలు.. రోహిత్ ‘హిట్‌మ్యాన్’ బ్రాండ్..

రోహిత్ శర్మ కొట్టిన ఆఖరి సిక్సర్ సరిహద్దు దాటగానే కెప్టెన్ విరాట్ కోహ్లీ పరిగెత్తుకుంటూ మైదానంలోకి వచ్చి రోహిత్‌ను ఆత్మీయంగా కౌగిలించుకుని సంబరాలు చేసుకున్నాడు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అలా అనూహ్యంగా రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాది విజయాన్ని అందించిన ఆ క్షణం రోహిత్‌ను ప్రపంచ క్రికెట్‌లో నిజమైన ‘హిట్‌మ్యాన్’గా నిలబెట్టింది. ఒత్తిడిలో కూడా రోహిత్ చూపించిన ప్రశాంతత, అద్భుత టైమింగ్ ఆయనను క్రికెట్ దిగ్గజాల సరసన సముచిత స్థానంలో నిలిపాయి.

ఇది కూడా చదవండి: Team India: రహానే దారిలోనే ఆ ఐదుగురు.. టీమిండియాకు గుడ్‌బై చెప్పనున్న స్టార్ క్రికెటర్లు..!

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Video: రోహిత్‌ను హిట్‌మ్యాన్‌గా మార్చిన మ్యాచ్ గుర్తుందా..
Video: రోహిత్‌ను హిట్‌మ్యాన్‌గా మార్చిన మ్యాచ్ గుర్తుందా..
ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా?
ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా?
5 నిమిషాల్లో చేసే రిసిపీ.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇదే బెస్ట్
5 నిమిషాల్లో చేసే రిసిపీ.. పిల్లల లంచ్ బాక్స్‌లోకి ఇదే బెస్ట్
మృతదేహంపై బంగారు ఆభరణాలు మాయం.. అనుమానం వచ్చి ఆరా తీస్తే..
మృతదేహంపై బంగారు ఆభరణాలు మాయం.. అనుమానం వచ్చి ఆరా తీస్తే..
QR కోడ్‌ మూలల్లో ఆ 3 బాక్స్‌లు ఎందుకుంటాయి? అసలు సీక్రెట్ ఇదే!
QR కోడ్‌ మూలల్లో ఆ 3 బాక్స్‌లు ఎందుకుంటాయి? అసలు సీక్రెట్ ఇదే!
అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ డబల్ ఎగ్ నూడిల్స్.. ఇలా చేయండి
అచ్చం ఫాస్ట్ ఫుడ్ సెంటర్ స్టైల్ డబల్ ఎగ్ నూడిల్స్.. ఇలా చేయండి
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
కిడ్నీలు, లివర్‌ను డిటాక్స్ చేసే మొనగాడు వజ్రాయుధం..
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
చోరీ చేసిన బంగారం, డబ్బు తిరిగి ఇంట్లోకి విసిరేసిన దొంగలు.. కానీ
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
డీ మార్ట్‌లో చీరలు ఎందుకు అమ్మరు? అసలు విషయం తెలిస్తే ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..
ఆహా ఓటీటీలో దూసుకుపోతున్న లవ్ స్టోరీ..