Nithiin: ఫ్లాపులకు ఫుల్‌స్టాప్ కోసం నితిన్ కొత్త ప్లాన్.. నాని నిర్మాణంలో ‘అలియాస్ రుక్మిణి’పై భారీ ఆశలు!
వరుస పరాజయాల తర్వాత హీరో నితిన్ కథల ఎంపికలో కొత్త దారి ఎంచుకున్నారు. ‘దండోరా’ దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్‌పై నిర్మిస్తుండటం విశేషం. కంటెంట్‌పై నమ్మకంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం నితిన్‌కు మళ్లీ విజయాన్ని అందిస్తుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.
వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న నితిన్ ఎట్టకేలకు కంటెంట్ ఓరియెంటెడ్ కథల వైపు అడుగులేస్తున్నారా..? దశాబ్ద కాలంగా సరైన హిట్టు లేక డీలా పడిపోయిన ఈ హీరో.. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని నిర్మాణంలో ఒక కొత్త సినిమా చేస్తున్నారు. మరి నాని డబ్బులు పెడుతున్నారంటే ఆ కథ ఎలా ఉండబోతుంది..? ఈ సినిమాతో అయినా నితిన్ ఫ్లాపుల పరంపరకు బ్రేక్ పడుతుందా..? గత పదేళ్లలో నితిన్ 12 సినిమాలు చేస్తే ఏకంగా 10 ఫ్లాపయ్యాయి. భీష్మ, అ..ఆ లాంటి రెండు హిట్లు మినహాయిస్తే చెక్, రంగ్ దే నుంచి గతేడాది వచ్చిన తమ్ముడు, రాబిన్ హుడ్ వరకు అన్నీ పరాజయాలే. వరుసగా డిజాస్టర్లు పలకరిస్తుండటంతో కొంత గ్యాప్ తీసుకున్న నితిన్.. ఈసారి పక్కా ప్లానింగ్‌తో కంటెంట్ ఉన్న కథను ఎంచుకుని తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. కథల విషయంలో ఇన్నాళ్లూ కాస్త తడబడిన నితిన్.. ఈసారి దండోరా ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో అలియాస్ రుక్మిణి అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని నాని తన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తుండటం. నాని లాంటి టేస్ట్ ఉన్న హీరో ఈ ప్రాజెక్టులో భాగం కావడంతో.. కథలో కచ్చితంగా ఏదో బలమైన విషయం ఉండే ఉంటుందని భావిస్తున్నారంతా. స్క్రిప్ట్ ఎంపికలో నాని జడ్జిమెంట్ అందరికీ తెలిసిందే కాబట్టి అలియాస్ రుక్మిణి కంటెంట్‌పై నమ్మకంగా ఉన్నారు నితిన్ కూడా. సక్సెస్ కోసం మొండి పట్టుదలతో ఉన్న ఈ హీరో తన పాత పంథా మార్చుకుని కొత్త కథ వైపు అడుగులేయడం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది. మరి రుక్మిణి అయినా నితిన్ ఫ్లాప్ స్ట్రీక్‌కు ఎండ్ కార్డ్ వేస్తుందో లేదో వేచి చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
Health Benefits of Punarnava: ఈ ఆకు పచ్చడి చేసుకుని తింటే.. మోకాళ్ల నొప్పులు పరార్
ఆ ఊరే.. ఓ రంగస్థలం.. అక్కడ అందరూ పాత్రధారులే..!
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు డిస్కో లైట్ల బెడద.. ల్యాండింగ్ వేళ ముప్పుగా మారిన లేజర్ లైట్లు
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
వీళ్లు తలతో కొడితే కొబ్బరికాయైనా పగలాల్సిందే
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్ ప్రమాదాలు.. రెండు రోజుల్లో ఇద్దరు మృతి
ఏ ఊరి పులి రా ఇది! డ్రోన్లకే షాకిస్తోంది..!
అరుదైన పెళ్లి వేడుక.. కవల వరులు, కవల వధువులు..
టాయిలెట్ కోసం బ్రేక్ ఇవ్వలేదని దారుణ హత్య..
గాల్లో ఉండగా విమానంలో భారీ కుదుపులు.. ప్రయాణికుల హాహాకారాలు
కనలేక కొనేస్తున్న దంపతులు.. అడ్డగోలుగా అమ్మేస్తున్న దళారులు

