అర్నబ్ తుఫాన్ కారణంగా కోస్తా తీరం అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వర్షాలకు వేలాది ఎకరాల కోత దశకు వచ్చిన పంటలు నీట మునిగాయి. తీవ్ర నష్టంతో అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం ఆదుకుని పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెట్టుబడి కూడా దక్కదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.