AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayana: రామాయణ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ

Ramayana: రామాయణ ప్రమోషన్స్‌లో నయా స్ట్రాటజీ

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Oct 27, 2026 | 4:27 PM

Share

రణ్‌బీర్‌ కపూర్‌, సాయి పల్లవి, యష్‌ ప్రధాన పాత్రల్లో నితీష్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ ప్రమోషన్స్‌లో కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు సమాచారం. సాధారణ టీజర్లు, గ్లింప్స్‌కు బదులుగా వీడియో సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు. ఏఆర్‌ రెహమాన్‌, హాన్స్‌ జిమ్మర్‌ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుండగా, వివిధ భాషల్లో సహజమైన లిప్‌ సింక్‌ కోసం ‘బ్రహ్మా ఏఐ’ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించినట్లు కథనం పేర్కొంటోంది.

ఇండియన్ స్క్రీన్ మీద మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న సినిమా ‘రామాయణ’. నితీష్ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యష్ లాంటి పాన్ ఇండియా స్టార్స్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి వరుస అప్‌డేట్స్ వస్తున్నాయి. రిలీజ్ డేట్‌ దగ్గర పడుతుండటంతో సరికొత్త ప్రమోషన్స్ స్ట్రాటజీతో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు మేకర్స్‌. మైథలాజికల్ విజువల్ వండర్ ఎపిక్ మూవీ రామాయణ ప్రమోషన్స్‌ విషయంలో గేర్ మార్చింది చిత్ర యూనిట్‌. హాలీవుడ్ రేంజ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో అదే స్ట్రాటజీ ఫాలో అవుతోంది. రెగ్యులర్ గ్లింప్స్, టీజర్ల ఫార్ములాకు భిన్నంగా.. వీడియో సాంగ్స్‌ను రిలీజ్ చేస్తూ ఆడియన్స్‌లో హైప్ పెంచుతున్నారు మేకర్స్. ఆస్కార్ విన్నర్స్ ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ లెజెండ్ హాన్స్ జిమ్మర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న మ్యూజిక్ ఈ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలవబోతోంది. అందుకే ఆ మ్యూజికల్ మ్యాజిక్‌తోనే ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. వరుసగా వీడియో సాంగ్స్ రిలీజ్ చేస్తూ.. విజువల్ గ్రాండియర్‌, ఎమోషనల్ డెప్త్‌తో ఆడియన్స్‌ను రామాయణ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమా కోసం అత్యాధునికమైన ‘బ్రహ్మా ఏఐ’ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు రివీల్ చేసి ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. సినిమాను హిందీలో తెరకెక్కించినా, ఇతర భాషల్లో ఆర్టిస్ట్‌ల లింప్‌ సింక్ విషయంలో ఇబ్బంది లేకుండా ఈ టెక్నాలజీ ఉపయోగపడింది. ఆర్టిస్ట్‌లు ప్రతీ భాషలో నేరుగా డైలాగ్స్ చెప్పినట్టు పెదవుల కదలికలు సహజంగా కనిపించేందుకు ఈ టెక్నాలజీని స్పెషల్‌గా రూపొందించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

హైదరాబాద్‌లో నీటి కొరత.. ఎమర్జెన్సీ ప్రకటించిన వాటర్ బోర్డు

సాలె పురుగు కుడితే అంత ప్రమాదమా!

పండగ రద్దీకి చెక్‌.. దీపావళికి స్పెషల్‌ రైళ్లుప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌

పెన్షనర్లకు బిగ్ షాక్! డిసెంబర్ 31 లోపు ఇది చేయాల్సిందే.. లేకపోతే

చుక్క నీటిని వృథా చేసినా.. చుక్కలు చూస్తారు.. హైదరాబాద్ వాసులకు జలమండలి వార్నింగ్‌

Follow Us