Cyclone Arnab Effect: అయ్యో.. అరటి పంటపై అర్నబ్‌ తుఫాను పంజా

×

Cyclone Arnab Effect: అయ్యో.. అరటి పంటపై అర్నబ్‌ తుఫాను పంజా

ఉత్తరాంధ్రను  అర్నబ్‌ తుఫాను అతలాకుతలం చేసింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అరటి పంటలను తీవ్రంగా దెబ్బతీసింది. పంట చేతికొచ్చే కీలక సమయానికి, అంటే మరో ఇరవై రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న తోటలపై తుఫాను బీభత్సం సృష్టించడంతో రైతులు కోలుకోలేని దెబ్బ తగిలింది. భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా వందలాది ఎకరాల్లో సాగు చేసిన అరటి తోటలు నేలకూలాయి. తుఫాను ధాటికి అరటి చెట్లు విరిగిపడటంతో పాటు, గెలలు పూర్తిగా పనికిరాని స్థితికి చేరుకున్నాయి. పలువురు రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ, ఐదు నుంచి ఆరు ఎకరాల్లో అరటి సాగు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఎకరానికి సుమారు రెండున్నర లక్షల రూపాయల వరకు పెట్టుబడి పెట్టినట్లు వారు వివరించారు. ఈ పెట్టుబడి అంతా అప్పులు చేసి, అధిక వడ్డీలకు తెచ్చి పెట్టినదేనని కన్నీటిపర్యంతమయ్యారు. తోటలను కాపాడుకునేందుకు కర్రల ఆధారాలు వేసినప్పటికీ, పెనుగాలులకు అవి కూడా నిలబడలేకపోయాయని రైతులు వాపోతున్నారు.

Janardhan Veluru