Cyclone Arnab Effect: గుంటూరు జిల్లా తెనాలి, కొల్లిపర మండలాలను అర్నబ్ తుఫాన్ తీవ్రంగా ప్రభావితం చేసింది. 42 మిల్లీమీటర్ల వర్షపాతంతో పాటు భారీ ఈదురుగాలులకు పంట చేతికొచ్చే సమయంలో వరి నేలపాలైంది. రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొల్లిపరలో రహదారులపై కూలిన చెట్లను పోలీసులు తొలగించారు.