AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంతైనా రష్మిక లక్కీగర్ల్ అబ్బా..!! మొన్న విజయ్ దేవరకొండతో పెళ్లి, ఇప్పుడు

స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న వివాహం ఫిబ్రవరి 26న గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఉదయ్ పూర్ లో వీరి వివాహం జరిగింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ జంట వివాహ బంధంతో ఒక్కటయ్యారు. విజయ్, రష్మిక పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు.

ఎంతైనా రష్మిక లక్కీగర్ల్ అబ్బా..!! మొన్న విజయ్ దేవరకొండతో పెళ్లి, ఇప్పుడు
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2026 | 3:02 PM

Share

అందాల తార రష్మిక పేరు తెలియని వారు ఉండరు. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీని షేక్ చేసింది ఈ అమ్మడు. కన్నడ ఇండస్ట్రీ నుంచి టాలీవుడ్ కు పరిచయమైన రష్మిక తొలి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది ఈ అమ్మడు. కెరీర్ బిగినింగ్ లో యంగ్ హీరోలతో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న రష్మిక ఆతర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసింది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. పుష్ప, పుష్ప 2 రెండు భారీ హిట్స్ గా నిలిచాయి. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసి సక్సెస అయ్యింది. ఇక హిందీలో రశ్మికకు మంచి క్రేజ్ ఉంది. యానిమల్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఇక రీసెంట్ గా స్టార్ హీరో విజయ్ దేవరకొండను పెళ్లాడింది రష్మిక. చాలా కాలంగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే.. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోవడంతో అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఫిబ్రవరి 26న విజయ్ రష్మిక పెళ్లి ఉదయ్ పూర్ లో జరిగిన విషయం తెలిసిందే. అలాగే వీరి రిసెప్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

ఇక తాజాగా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను అనౌన్స్ చేసింది. 2025 తెలంగాణ సర్కార్ గద్దర్‌ అవార్డుల అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోనే రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికైంది. గర్ల్ ఫ్రెండ్ సినిమాకు గాను రష్మిక మందన్న ఉత్తమ నటిగా ఎంపికైంది. దాంతో రష్మిక , విజయ్ అభిమానులు సంతోషంలో తేలిపోతున్నారు. మొన్నే పెళ్లి , ఇప్పుడు ఉత్తమ నటి అవార్డుకు ఎంపిక అవ్వడం.. ఈ అమ్మడు అదృష్టం మాములుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎంతైనా రష్మిక లక్కీ గర్ల్ అబ్బా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
Video: స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ అత్యున్నత శౌర్య పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
భారత సంతతి మహిళ నవనీతం పిళ్లైను వరించిన నోబెల్ శాంతి పురస్కారం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
రాంచీలో వెస్టిండీస్ సంచలన విజయం
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
టమాటా పులావ్ ఇలా చేశారంటే.. అన్నం గిన్నె ఖాళీ అయ్యే వరకు ఆపలేరు!
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
వీరి జీవితాన్ని మార్చబోతున్న గ్రహాల రాకుమారుడు.. అప్పులు క్లియర్
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన మమిత.. ఒక్కో మూవీకి ఎన్ని కోట్లంటే?
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పార్క్ చేసిన కారును బొమ్మలా వెనక్కి నెట్టేసిందిగా..!
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
పండగకు ఊరికి వెళ్లేవారికి అలర్ట్.. ఇంటి భద్రతపై పోలీసుల కీలక సూచన
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
అమెరికా కలపై అనిశ్చితి.. అగ్రరాజ్యంలో జాబ్ ఓకే..
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా
బిర్యానీ ఆకుతో కాళ్ల నొప్పులు మాయం అవుతాయా? వైరల్ చిట్కా