AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి

సినిమా ఇండస్ట్రీలో శృంగార తారగా గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ సోనా. ఎన్నో సినిమాల్లో తన గ్లామర్ తో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా తమిళ్ సినిమాల్లో నటించి అలరించింది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

నరకం చూపించాడు..! అతన్ని తట్టుకోవడం నా వల్ల కాదు..!! 16 సినిమాలు రిజెక్ట్ చేశానన్న నటి
Actress Sona
Rajeev Rayala
|

Updated on: Mar 10, 2026 | 7:48 PM

Share

క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న సమస్య. కొంతమంది బహిరంగంగా తాము ఎదుర్కున్న సమస్యలను మీడియా ముందు పెట్టేశారు. కొంతమంది తమకు ఎదురైన లైంగిక ఇబ్బందుల గురించి మాట్లాడితే మరికొంతమంది ఇండస్ట్రీలో జరిగిన రాజకీయాల గురించి, కొందరు చేసిన మోసాల గురించి బయటపెడుతుంటారు. తాజాగా ఓ నటి స్టార్ కమెడియన్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ నటుడితో నరకం చూశాను అని తెలిపి షాక్ ఇచ్చింది ఆమె.. అంతే కాదు ఆయనతో కలిసి నటించాల్సిన 16 సినిమాలను రిజెక్ట్ చేసిందట ఆ నటి. ఇంతకూ ఆమె ఎవరు.? ఆమెను అంతగా ఇబ్బందిపెట్టిన ఆ నటుడు ఎవరో ఒక్కసారి చూద్దాం.!

తమిళ్ ఇండస్ట్రీలో తనకంటూ మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామల్లో సోనా ఒకరు. ఈ బ్యూటీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఎక్కువగా శృంగార పాత్రల్లో కనిపించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  సోనా, నటుడు వడివేలుతో కలిసి భవిష్యత్తులో నటించే అవకాశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. “కుశేలన్” చిత్రం విడుదలైన తర్వాత, తనకు వడివేలు గారితో కలిసి నటించడానికి దాదాపు 16 సినిమా అవకాశాలు వచ్చాయని ఆమె వెల్లడించారు. అయితే, ఆ అవకాశాలన్నింటినీ తాను తిరస్కరించినట్లు సోనా తెలిపారు.

ఈ విషయంపై మాట్లాడుతూ, నన్ను వదిలేయండి సామీ, ఆ మనిషితో నేను నటించలేను అని సోనా తెలిపారు. వడివేలును తాను హ్యాండిల్ చేయలేనని, ఈ విషయంపై మరింత బహిరంగంగా మాట్లాడటం అనవసరం అని ఆమె అన్నారు. ఎందుకంటే ఈ గురించి తాను గతంలోనూ మాట్లాడానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ ఆత్మాభిమానం ఉంటుందని.. కేవలం పేరు, కీర్తి లేదా ఒక సినిమా వస్తుందనే కారణంతో ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టలేమని ఆమె చెప్పుకొచ్చారు. లోపల జరిగే విషయాలు తమకే తెలుస్తాయని, మానం, మర్యాద గురించి అందరూ మాట్లాడుతారని, కానీ వ్యక్తిగతంగా ఏమి జరుగుతుందో తమకు మాత్రమే తెలుస్తుందని సోనా స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశమయ్యాయి.

ఇవి కూడా చదవండి
Vadivelu

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us