13 March, 2026
Subhash
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న వివాదం ప్రపంచ ఇంధన మార్కెట్లో అనిశ్చితిని పెంచింది. దీని ప్రభావం భారతదేశంలో కూడా కనిపిస్తోంది.
LPG గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనలలో కేంద్ర ప్రభుత్వం నిరంతరం మార్పులు చేస్తోంది.
పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్ సింగ్ పూరి గ్రామీణ ప్రాంతాల్లో కూడా సిలిండర్ల బుకింగ్ వ్యవధిని పొడిగించారు.
గ్రామీణ ప్రాంతాల్లో LPG సిలిండర్లను బుక్ చేసుకోవడానికి ఇప్పుడు 45 రోజుల గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు
తదుపరి బుకింగ్ కోసం కనీసం 45 రోజులు వేచి ఉండాల్సి ఉంటుందని ఆయన పార్లమెంటుకు తెలియజేశారు. పట్టణ ప్రాంతాలకు బుకింగ్ వ్యవధిని 25 రోజులు.
అయితే 45 రోజుల గడువు అనేది రెండు సిలిండర్ల బుకింగ్ గ్యాప్ 25 రోజులు ఉండగా, ఇప్పుడు దీనిని 45 రోజులకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
రెండు రోజుల క్రితం, కేంద్ర ప్రభుత్వం నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించడానికి LPG సిలిండర్ల బుకింగ్ నిబంధనలను సవరించింది.
LPG గ్యాస్ సిలిండర్ల బుకింగ్ వ్యవధిని 21 రోజుల నుండి 25 రోజులకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.