AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

బాలీవుడ్అందాల తార దీపికా పడుకొణె మళ్లీ అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఇప్పుడామె గర్భంతో ఉంది. అయితే ప్రస్తుతం ఆమె రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తోంది. అందులో ఒకటి అల్లు అర్జున్ నటిస్తోన్న రాకా మూవీ. అట్లీ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Deepika Padukone: అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్
Deepika Padukone, Allu Arjun Raaka Movie
Basha Shek
|

Updated on: Apr 23, 2026 | 10:15 PM

Share

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపిక గురించి రకరకాల రూమర్స్‌ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రాకా’ చిత్రం నుంచి దీపికా పడుకొణెను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొనడం కష్టం అని తెలిసి.. దీపిక స్థానంలో మరో నటిని తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తొలగించకపోయినా రాకా సినిమాలో దీపిక పాత్ర నిడివిని కూడా పూర్తిగా తగ్గిస్తున్నారన్న రూమర్లు కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో రాకా చిత్ర బృందం ఈ పుకార్లపై స్పందించింది. అల్లు అర్జున్ రాకా సినిమాలో దీపికా పదుకొణె పాత్రను తొలగిస్తున్నారన్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని చిత్ర బృందం తెలిపింది. ‘ రాకా సినిమాకు సంబంధించి అన్నీ ప్రణాళిక ప్రకారమే జరుగుతున్నాయి. ఈ చిత్రంలో దీపికా పడుకొణె చాలా కీలక పాత్ర పోషిస్తుంది. షూటింగ్ ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగుతోంది’ అని చిత్ర బృందం పేర్కొంది.

నివేదికల ప్రకారం, దీపికా గర్భంతో ఉన్నప్పటికీ సినిమా షూటింగుల్లో చురుకుగా పాల్గొంటోందని సమాచారం. షూటింగ్ షెడ్యూల్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా దీపిక తన డేట్స్ ను సర్జుబాటు చేసుకుందని తెలుస్తోంది. అంతేకాకుండా, ఆమె చిత్రంలోని కొన్ని ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలలో కూడా పాల్గొంటోందని చెబుతున్నారు. ఈ క్రమంలో చిత్ర బృందం కూడా దీపిక కోసం అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరుపుతోంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సన్ పిక్చర్స్’ నిర్మిస్తోంది. సుమారు 800 కోట్ల బడ్జెట్ తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే అభిమానుల్లో చాలా ఆసక్తిని రేకెత్తించింది. అల్లు అర్జున్, దీపికా తొలిసారిగా కలిసి నటిస్తున్న ఈ చిత్రం 2027లో విడుదల కానుంది.

గతంలో, దీపికా పడుకొణె ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న  ‘స్పిరిట్’ తో పాటు ‘కల్కి 2898 AD’ సీక్వెల్ నుంచి తప్పుకుంది. తాను రోజుకు 8 గంటలు మాత్రమే పని చేస్తానని ఆమె షరతు విధించడంతో, చిత్ర బృందాలు ఆమెకు బదులుగా ఇతర హీరోయిన్లను తీసుకున్నాయి. అయినప్పటికీ, దీపిక పదుకొణె డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us