AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahesh Babu: మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? పాపం ఇప్పుడేమో..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్లతోనూ రొమాన్స్ చేశాడు. అయితే ఒక హీరోయిన్ మాత్రం మహేష్ బాబుకు తల్లిగానూ, లవర్ గానూ, భార్యగానూ నటించింది. ఇలా మహేష్ తో నటించిన ఏకైక హీరోయిన్ ఆమె ఒక్కరే కావడం గమనార్హం.

Mahesh Babu: మహేష్‌కు తల్లిగా, భార్యగా నటించిన ఏకైక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? పాపం ఇప్పుడేమో..
Mahesh Babu
Basha Shek
|

Updated on: Apr 22, 2026 | 8:27 PM

Share

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో కలిసి నటించాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆయనతో రొమాన్స్ చేయాలంటే రాసి పెట్టి ఉండాలి. అందుకే బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం మహేష్ తో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. గతంలో బిపాసా బసు, ప్రీతిజింటా, అదితీ రావు, అమీషా పటేల్, కృతి సనన్ వంటి స్టార్ హీరోయిన్లు మహేష్ తో రొమాన్స్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్ గా రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాలో మహేష్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తోంది. వీరే కాకుండా సమంత, కాజల్ అగర్వాల్, సిమ్రాన్, సోనాలి బింద్రే, భూమిక, త్రిష, ఇలియానా, తమన్నా, శ్రుతి హాసన్, ప్రణీత, పూజా హెగ్డే, రష్మిక మందన్నా, శ్రీలీల వంటి ఎందరో స్టార్ హీరోయిన్లు మహేష్ తో కలిసి నటించారు. అయితే వీరందరూ మహేష్ కు లవర్ గా, భార్యగానో నటించిన వాళ్లే. కానీ ఓ హీరోయిన్ మాత్రం మన సూపర్ స్టార్ కు తల్లిగా, భార్యగా నటించింది. అది కూడా ఒకే సినిమాలో. మరి ఇంతకీ ఆమె ఎవరనుకుంటున్నారా?

ఖుషి డైరెక్టర్ ఎస్ జే సూర్య దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన సినిమా నాని. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో అమీషా పటేల్, మహేష్ బాబు లవర్స్ గా కనిపిస్తారు. ఆతర్వాత పెళ్లి చేసుకుని భార్య భర్తలుగా మారుతారు. ఇక క్లైమాక్స్‌లో జూనియర్ మహేష్ బాబు కూడా పుడతాడు. క్లైమాక్స్ సీన్‌లో మహేష్ బాబుకు అమ్మగా కనిపిస్తుంది. ఇలా ఒకే సినిమాలో మహేష్ బాబుకు లవర్‌గా, భార్యగా, తల్లిగా కనిపించింది అమీషా పటేల్.

ఇవి కూడా చదవండి

అమీషా పటేల్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్, వీడియోస్..

కాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బద్రి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అమీషా పటేల్. అందులో సరయూగా క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఇక నాని తర్వాత ఎన్టీఆర్ తో కలిసి నరసింహుడు అనే సినిమాలో యాక్ట్ చేసిందీ అందాల తార. అయితే బద్రి తర్వాత రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ ముద్దుగుమ్మ మళ్లీ ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. బాలీవుడ్ కు వెళ్లి అక్కడే సెటిలైపోయింది.

50 ఏళ్లు వచ్చినా సింగిల్ గానే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us