AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rakasa OTT: నరబలి కోరే బ్రహ్మ రాక్షసుడు.. ఓటీటీలోకి ‘రాకాస’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

వేసవి కానుకగా ఏప్రిల్ 03న విడుదలైన రాకాస సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఆడియెన్స్ ను బాగానే భయపెడుతూ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడీ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.

Rakasa OTT: నరబలి కోరే బ్రహ్మ రాక్షసుడు.. ఓటీటీలోకి 'రాకాస'! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Rakasa Movie
Basha Shek
|

Updated on: Apr 21, 2026 | 6:30 PM

Share

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ రాకాస. లేడీ డైరెక్టర్ మానస శర్మ తెరకెక్కించిన ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మించింది. ఏప్రిల్ 03న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీనికి తోడు నిహారికతో పాటు చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేయడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఫాంటసీ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు మూడు వారాలవుతోంది. ఇప్పటికీ అక్కడక్కడ థియేటర్లలో ఆడుతోంది. అయితే ఈ రాకాస సినిమాను ఓటీటీలోనూ చూడాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే వీరి కోరిక నెరవేరనుంది. రాకాస సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ ఫ్లిక్స్ చేసుకుంది. ఈ మేరకు థియేటర్‌లో రిలీజైన 4 వారాల తర్వాతనే ఓటీటీలో రిలీజ్ చేయాలనే అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం రాకాస మూవీ ఏప్రిల్ చివరి వారంలో లేదా మే రెండో వారంలో ఓటీటీలో విడుదలయ్యే అవకాశం ఉంది.. దీనిపై త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ ఫుల్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. కాగా రాకాస సినిమాలో భారీ తారగణమే ఉంది. వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ఆశిష్ విద్యార్థి, అన్నపూర్ణ, వాసు ఇంటూరి, రోహిణి, అనూప్ సింగ్, రోహన్ రాయ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించగా, ఈడురోలు రాజు సినిమాటోగ్రాఫర్‌గా, అన్వర్ అలీ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

మే మొదటి వారంలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
యూబ్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
యూబ్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి... ఎందుకో తెలుసా..!
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
నాన్న చనిపోయాక జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ అన్ని కష్టాలు పడ్డాడా?
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
శ్రీరామ భక్తులకు అయోధ్య నుంచి శుభవార్త.. 70+ వయోవృద్ధులు..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు.. నిర్మలా క్లారిటీ..
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
జెన్ జీ యువతపై ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి
40 ఏళ్లలోపే మెనోపాజ్.. అమ్మాయిలు కాస్త జాగ్రత్త! ఇవి తెలుసుకోండి