AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్

ప్రశాంతంగా ఉండే ఒక పల్లెటూరిలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. మెడకు, చేతులకు గొలుసులు కట్టి అతి దారుణంగా చంపేస్తుంటారు. మరి ఈ మర్డర్స్ ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? కరడుగట్టిన హంతకులను పోలీసులు ఎలా కనిపెట్టారన్నదే ఈ సినిమా కథ.

OTT Movie: ప్రశాంతమైన ఊరిలో వరుస హత్యలు.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 20, 2026 | 8:40 PM

Share

గత వారం బోలెడన్నీ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర భాషలకు చెందిన సినిమాలు ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అలా గత వారమే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది. సైకో కిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ కు మంచి థ్రిల్ ఇస్తోంది. అంతకు ముందే ఫిబ్రవరి 20న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఆడియెన్స్ ను బాగానే అలరించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ మూవీకి ఐఎమ్‌డీబీలోనూ టాప్ రేటింగ్ దక్కడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. అనెగుడ్ల అనే ఊరి పోలీస్ స్టేషన్ చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ప్రశాంతంగా ఉండే ఈ గ్రామంలో వరుసగా దారుణ హత్యలు జరుగుతాయి. మెడకు, చేతులకు గొలుసులు కట్టి అతి దారుణంగా చంపేస్తుంటారు. దీంతో ఊరి ప్రజలు భయటకు వెళ్లాలంటేనే వణికిపోతుంటారు. ఈ సీరియల్ మర్డర్స్ ను ఛేదించడానికి సీతారాం అనే ఒక పవర్ ఫుల్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. ఈ బ్రూటల్ మర్డర్స్ వెనుక ఓ సైకో ఉన్నాడని దర్యాప్తులో తెలుసుకుంటాడు. మరి అసలు గ్రామంలో హత్యలు చేస్తుంది ఎవరు? సైకో కిల్లర్‌ ఉద్దేశమేంటి? అతనిని సీతారాం ఎలా పట్టుకున్నాడు? అన్న ప్రశ్నలకు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ‘సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం’. ఇదొక కన్నడ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. గతంలో వచ్చిన సీతారాం బెనోయ్ కేస్ నెం.18 మూవీకి సీక్వెల్‌గా ఇది తెరకెక్కింది. దేవి ప్రసాద్ శెట్టి తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ రాఘవేంద్ర, గోపాల్ దేశ్ పాండే, ఉష భండారి తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫ్లైయింగ్ ఎలిఫెంట్ స్టోరీ టెలర్స్ బ్యానర్‌పై దేవి ప్రసాద్, సాత్విక్ హెబ్బర్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. ప్రస్తుతం ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం కన్నడ, తమిళ భాషల్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలోనే తెలుగులోనూ స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడే ఈ సినిమాను చూడాలనుకునేవారు ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో ఎంజాయ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ వీడియోలో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
శుభ గ్రహాల యుతితో అదృష్టం.. ఇక వారు జీవితంలో ఓ మెట్టు పైకి..
శుభ గ్రహాల యుతితో అదృష్టం.. ఇక వారు జీవితంలో ఓ మెట్టు పైకి..
ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెకీ.. ఎందుకో తెలుసా?
ఐటీ జాబ్ వదిలేసి ఆటో డ్రైవర్‌గా మారిన మహిళా టెకీ.. ఎందుకో తెలుసా?
మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
మీ మొబైల్‌లో ఈ 12 యాప్స్‌ ఉండాల్సిందే..
ఒక్కసారి ఇలా చేసి చూడండి.. గ్రేవీ టేస్ట్ అయితే వేరే లెవల్..
ఒక్కసారి ఇలా చేసి చూడండి.. గ్రేవీ టేస్ట్ అయితే వేరే లెవల్..
40+ వయసులోనూ గ్లోయింగ్ స్కిన్ కోసం బెస్ట్ కొల్లాజెన్ డ్రింక్స్..
40+ వయసులోనూ గ్లోయింగ్ స్కిన్ కోసం బెస్ట్ కొల్లాజెన్ డ్రింక్స్..
చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 దీంట్లో ఉంటుంది..
చేపలకంటే ఎక్కువ ఒమేగా-3 దీంట్లో ఉంటుంది..
చికెన్‌తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే
చికెన్‌తో పాటు చేపలు తింటే ఏమవుతుంది..? అసలు నిజాలు తెలిస్తే
21 లక్షల కార్ గెలిచిన వైభవ్.. డ్రైవ్ చేయాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందే
21 లక్షల కార్ గెలిచిన వైభవ్.. డ్రైవ్ చేయాలంటే 3 ఏళ్లు ఆగాల్సిందే
వేసవిలో చల్లగా తియ్యగా అస్సలు నూనె వాడకుండా చేసుకోగలిగే రెసిపీ
వేసవిలో చల్లగా తియ్యగా అస్సలు నూనె వాడకుండా చేసుకోగలిగే రెసిపీ
ఇంట్లోనే తయారుచేసుకునే అద్భుత సీరమ్.. ముడతలు మాయం, ముఖంలో మెరుపు
ఇంట్లోనే తయారుచేసుకునే అద్భుత సీరమ్.. ముడతలు మాయం, ముఖంలో మెరుపు