AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ముంబైలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు

ఈ మధ్యన ప్రముఖ వ్యక్తులు, నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలా గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఓ రియల్ స్టోరీ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

OTT Movie: ముంబైలో జరిగిన రియల్ స్టోరీ.. ఓటీటీ టాప్ ట్రెండింగ్‌లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. తెలుగులోనూ చూడొచ్చు
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 19, 2026 | 11:41 AM

Share

గత వారం పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్, యూత్, సుయోధన, సంభవం అధ్యాయం పన్ను, అలా చేరే సీతారాముని చెంతకు, టోస్టర్ వంటి సినిమాలు, పోచమ్మ వంటి ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా ఓటీటీ ఆడియెన్స్ ను అలరిస్తున్నాయి. అయితే గత వారమే ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. హిందీలో రిలీజైన తెలుగులోనూ ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ విషయానికి వస్తే.. ఇదొక రియల్ మాఫియా స్టోరీ. ముంబై మాఫియా, జూదం నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. అక్కడ జూదంలో రియల్ మాట్కా కింగ్స్ గా పేరు మోసిన రతన్ ఖత్రీ, కళ్యాణ్ జీ భగత్ జీవిత కథల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ను రూపొందించారు. బ్రిజ్ భట్టి ఒక సాధారణ వ్యక్తి నుంచి మట్కా సామ్రాజ్యానికి అధిపతిగా ఎలా ఎదిగాడన్నది ఈ సిరీస్ లో మెయిన్ పాయింట్. తన బాస్ లాల్‌జీ భాయ్ (గుల్షన్ గ్రోవర్) నీడ నుంచి బయటకు వచ్చి, తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును బ్రిజ్ సంపాదించుకుంటాడు. లాల్‌జీకి నీతి నియమాలు లేకపోయినా, బ్రిజ్ మాత్రం జూదంలో కూడా ‘నిజాయతీ’ ఉండాలనుకుంటాడు. పేదవారికి అండగా ఉంటూనే, అక్కడి జూదరుల వ్యవస్థను ఎదిరించి తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడు అన్నదే ఈ సిరీస్ కథ.

తమన్నా మాజీ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు మట్కాకింగ్. నాగరాజ్ మంజులే తెరకెక్కించిన ఈ మాఫియా థ్రిల్లర్ సిరీస్ లో క్రితికా కామ్రా, గుల్షన్ గ్రోవర్, సిద్ధార్థ్ జాదవ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో ఉన్న ఈ సిరీస్ ను చూసి నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. చాలా మంది ఈ సిరీస్ ‘స్కామ్ 1992’ వంటి షోలను గుర్తుకు తెస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. వీకెండ్ లో మంచి థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి మట్కాకింగ్ ఓ మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో మట్కాకింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
బీసీసీఐ వద్దంది.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్.. ఎవరంటే?
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
పాత మర్డర్ కేసును బయటపెట్టిన బీచ్‌లో కొట్లాట..!
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
తెల్లం అన్నం దీని ముందు జుజుబీ.. గిన్నెడు తింటే ఏ రోగం రానివ్వదు
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
25 రోజుల్లోనే పంట చేతికి.. ఈ ట్రిక్స్ తెలిస్తే పాలకూర సాగుతో..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
జల్సాల కోసం కన్నతల్లి ఇంటికే నిప్పుపెట్టిన కుమారుడు..
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
మకరంలోకి రాహువు.. ఈ 3 రాశులకు ఉద్యోగం, డబ్బు విషయంలో అదృష్టం!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
రూ.500 నోటుతో చేసిన ఒక్క రీల్‌తో జైలుకు..!
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
బంగారం ప్రియులకు తీపి కబురు.. రూ.1.34 లక్షలకు దిగిరానున్న గోల్డ్
మాజీ ప్రియుడి వేధింపులు.. కాపురం కూల్చిన అశ్లీల ఫొటోలు
మాజీ ప్రియుడి వేధింపులు.. కాపురం కూల్చిన అశ్లీల ఫొటోలు
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో
బ్యాంక్ అధికారులమంటూ బురిడీ.. క్రెడిట్ కార్డు యాక్టివేషన్ పేరుతో