JD Chakravarthy: హీరో జేడీ చక్రవర్తి భార్య తెలుగులో క్రేజీ హీరోయిన్ అని తెలుసా? ఆ ఒక్క బోల్డ్ సినిమాతో బాగా ఫేమస్
నాగార్జున శివ సినిమాలో విలన్ గా చేసిన జేడీ చక్రవర్తి ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. గులాబి, బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా వంటి పలు ప్రేమకథా చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మెప్పించాడు. అలాగే మృగం, సత్య వంటి యాక్షన్ సినిమాల్లోనూ అదరగొట్టాడు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మల్టీ ట్యాలెంటెడ్ పర్సనాలిటీస్ లో జేడీ చక్రవర్తి ఒకరు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా స్క్రీన్ రైటర్ గా, డైరెక్టర్ గా, మ్యూజిషియన్ గా సత్తా చాటారు. నాగార్జున హీరోగా నటించిన శివ సినిమాలో విలన్ పాత్రతో కెరీర్ ఆరంభించారు జేడీ. ఆ తర్వాత హీరోగా మారి వరుస హిట్స్ అందుకున్నాడు. మనీ, వన్ బై టూ, మనీ మనీ, గులాబీ, బొంబాయి ప్రియుడు, అనగనగా ఒక రోజు, ఎగిరే పావురమా, నేను ప్రేమిస్తున్నాను, ప్రేమకు వేళాయేరా, పాపే నా ప్రాణం తదితర సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేశారు జేడీ. ఒకానొకదశలో స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చిన అతను క్రమంగా ఫేడవుట్ అయిపోయాడు. హీరోగా చేసిన సినిమాలు ఫెయిల్ అయ్యాయి. దీంతో మళ్లీ సహాయక నటుడిగా, విలన్ గా అవతారమెత్తి విజయాలు అందుకున్నాడు. దుబాయ్ శీను, హోమం, జోష్ తదితర సినిమాల్లో జేడీ కీలక పాత్రలు పోషించారు.
కాగా జేడీ చక్రవర్తి చివరిగా 2023లో దయ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఇప్పుడు చేతబడి అనే మరో డిఫరెంట్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. జేడీ చక్రవర్తి భార్య కూడా హీరోయిన్ అనే విషయం చాలా మందికి తెలియదు. ఆమె పేరు అనుకృతి శర్మ. వీరిద్దరు 2016లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇప్పుడు వీరిద్దరు వేర్వేరుగా ఉంటున్నట్లు సమాచారం. అనుకృతి శర్మ తెలుగులో చేసింది చేసింది రెండు, మూడు సినిమాలే. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ 2014లో ప్రకటించిన శ్రీదేవి సినిమాలో అనుకృతి నటించింది. ఒక కుర్రాడు తనకంటే వయసులో పెద్దదైన టీచర్‌ను ఇష్టపడే బోల్డ్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీశారు. అప్పట్లో ఈ సినిమా పోస్టర్లు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ కాలేదు. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన పాప సినిమాలో కూడా అనుకృతి నటించింది. ఇవే కాకుండా కొన్ని హిందీ సినిమాలు, వెబ్ సిరీసుల్లో కూడా ఈ బ్యూటీ నటించింది.

Jd Chakravarthy Marriage Photo
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




