Dacoit Movie: ఒకరు కాదు ఇద్దరు.. అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్. ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ లవ్ స్టోరీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతూ నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చి పెడుతోంది.

అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్ ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా కలెక్షన్ల విషయంలోనూ దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే రూ. 50 కోట్లకు చేరువైన ఈ సినిమా ఓవర్సీస్ లోనూ రికార్డు వసూళ్లు రాబడుతోంది. షానీల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో ఆయన పవర్ ఫుల్ విలన్ రోల్ చేశారు. వీరితో పాటు ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా తో మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు అడివి శేష్. ఇందులో అతని నటనకు మంచి పేరు వస్తోంది. అయితే డెకాయిట్ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..
డెకాయిట్ సినిమాకు హీరోగా అడివి శేష్ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ సినిమాను అక్కినేని నాగార్జున మేనకోడలు, సుప్రియ నిర్మించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ముందుగా డెకాయిట్ సినిమాను అడివి శేష్ కంటే ముందు అక్కినేని నాగ చైతన్యతో చేయాలని అనుకుందట.అయితే నాగ చైతన్య మాత్రం ఒప్పుకోలేదట. ఈ సినిమా నాకంటే , అడివి శేష్ చేస్తేనే బాగుంటుంది అని క్లియర్ గా చెప్పాడట. ఈ విషయాన్నీ అడివి శేష్ కి కూడా అతను ఫోన్ చేసి చెప్పాడట. అలా మొత్తానికి అడివి శేష్ హీరోగా డెకాయిట్ సినిమా పట్టాలెక్కిందట.
కాగా ఆ మధ్యన నాగ చైతన్య సోదరుడు, హీరో అక్కినేని అఖిల్ కు కూడా ఈ డెకాయిట్ కథ వినిపించారని ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాలతో అఖిల్ ఈ సినిమాను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదని ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంతుంతో తెలియదు కానీ.. ప్రస్తుతం ఈ వార్తలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
డెకాయిట్ సినిమాలో అడివి శేష్, మృణాళ్ ఠాకూర్..
కలిసుంటేనే ప్రేమంటారా ? ❤️#NeeventaNenu video song from #Dacoit out now! ▶️ https://t.co/xFghxwwtL9
A love story unlike anything you’ve ever seen ❤🔥 Experience #Dacoit on the big screens 🤩
Book your tickets now! 🎟️ https://t.co/fCtmCkNlAI#AudienceBlockbusterDacoit pic.twitter.com/JNcdBYEqox
— Annapurna Studios (@AnnapurnaStdios) April 15, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




