AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ‘జురాసిక్‌ పార్క్‌’ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఈ హీరోయిన్ తెలుగు, హిందీ,కన్నడ, తమిళం, మలయాళం తదితర భారతీయ భాషలన్నింటిలోనూ సినిమాలు చేసింది. తన అందం, అభినయంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ అందాల తారకు హాలీవుడ్ సినిమా ఛాన్స్ కూడా వచ్చింది. అది కూడా ది గ్రేట్ జురాసిక్ పార్క్ మూవీలో.. కానీ..

Tollywood: ‘జురాసిక్‌ పార్క్‌' సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో తెలుసా?
Tollywood Actress
Basha Shek
|

Updated on: Apr 14, 2026 | 3:19 PM

Share

హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశమొస్తే ఎగిరి గంతేస్తారు. డబ్బుకు డబ్బు.. ఇంటర్నేషనల్ బ్రాండింగ్.. ఇంకా కావాల్సినంత ప్రచారం అన్నీ ఒకేసారి వచ్చి పడతాయి. ఉదాహరణకు ప్రియాంక చోప్రానే తీసుకుంటే ఇప్పుడీ ముద్దుగుమ్మ గ్లోబల్ బ్యూటీగా మారిపోయింది. హాలీవుడ్ స్టార్స్ సినిమాల్లో ఛాన్స్ లు వస్తున్నాయి. అందుకే హాలీవుడ్ సినిమాల్లో ఛాన్స్ వస్తే ఎవరైనా అసలు వదులుకోరు. అందులోనూ ది గ్రేట్ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ సినిమా అంటే కథేంటో కూడా అడగకుండా ఒకే చెబుతారు. కానీ అలాంటి డైరెక్టర్ కే నో చెప్పింది అలనాటి అందాల తార శ్రీదేవి. అదికూడా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ జురాసిక్ పార్క్ లో నటించే ఛాన్స్ వద్దనుకుందీ ముద్దుగుమ్మ. . 1993లో విడుదలైన ‘జురాసిక్‌ పార్క్‌’ ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. ఇండియాలోనూ రికార్డు కలెక్షన్లు సాధించింది. ఇప్పటికీ కూడా ఈ జురాసిక్ పార్క్ సినిమాలు వస్తున్నాయంటే ఫస్ట్ షోకు వెళ్లి చూసే వారు చాలా మంది ఉన్నారు. అలాంటి చిత్రంలో నటించే అవకాశాన్ని శ్రీదేవి కాదనుకుంది. అందుకు గల కారణాన్ని ఆమె ఓ సందర్భంలో పంచుకుంది.

మీరెందుకు ‘జురాసిక్‌ పార్క్‌’ సినిమాలో నటించేందుకు నో చెప్పారు అని అడగ్గా శ్రీదేవి ఇలా సమాధానమిచ్చింది.. ‘ ఆ రోజుల్లో హాలీవుడ్‌ సినిమాలంటే ఏలియన్‌లా చేయడమే. కానీ, ఇప్పుడు అదొక గౌరవం. అయితే నాకు ఇండియన్ సినిమాలను వదిలి పెట్టి హాలీవుడ్ సినిమాలను చేయడం ఇష్టం లేదు’ అని సున్నితంగా జురాసిక్ పార్క్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందట శ్రీదేవి. దీనికి తోడు ఆ సమయంలో శ్రీదేవి కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉందట. అందుకే ఉన్నట్లుండి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని విడిచి పెట్టడం ఇష్టం లేక స్టీవెన్ స్పీల్ బర్గ్ ఆఫర్ కు నో చెప్పిందట. దీంతో పాత్రకు హాలీవుడ్‌ నటి ఏరియానా రిచర్డ్స్‌ను తీసుకున్నారట.

కాగా శ్రీదేవి తన సినిమా కెరీర్ లో పలు బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలను రిజెక్ట్ చేసింది. 1993లో షారూక్‌ ఖాన్‌, సన్నీడియోల్‌, జుహీ చావ్లా ప్రధాన తారగణంగా తెరకెక్కిన ‘డర్‌’లో హీరోయిన్ గా మొదట శ్రీదేవినే సంప్రదించారు. అలాగే తెలుగు సినీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ‘బాహుబలి‌’ రెండు భాగాల్లో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవినే అనుకున్నారు. ఆమె కాదనడంతో ఆ అవకాశం రమ్యకృష్ణను వరించింది. కాగా భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన శ్రీదేవి 2018, ఫిబ్రవరి 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి
Actress Sridevi

Actress Sridevi

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us