AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల దుష్ప్రచారం.. తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ

బంగ్లాదేశ్‌లోని మురికివాడలను కెమెరాలో చూపిస్తూ.. అదే భారతదేశ రాజధాని న్యూఢిల్లీ అని ప్రపంచానికి అసత్యాలు నూరిపోస్తున్నారు కొందరు విదేశీయులు. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్టను దిగజార్చేందుకు చైనాకు చెందిన 150 మందికి పైగా వ్లాగర్లు బంగ్లాదేశ్ కేంద్రంగా ఒక పథకం ప్రకారం నడుపుతున్న ఈ నయా కుట్ర ఇప్పుడు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. చైనా సోషల్ మీడియాలో భారత్‌పై సాగిస్తున్న ఈ విషప్రచారంపై కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రస్థాయిలో మండిపడింది.

బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల దుష్ప్రచారం.. తీవ్రంగా స్పందించిన భారత విదేశాంగ శాఖ
Chinese Vloggers Frame Dhaka Slums As New Delhi
Krishna S
|

Updated on: Nov 10, 2026 | 10:05 PM

Share

భారతదేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో దెబ్బతీసేందుకు చైనాకు చెందిన కొందరు సోషల్ మీడియా క్రియేటర్లు దిగజారుడు చేష్టలకు పాల్పడుతున్నారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అత్యంత వెనుకబడిన, పేద మురికివాడల్లో వీడియోలు చిత్రీకరిస్తూ.. ఆ ప్రాంతాలను భారతదేశ రాజధాని న్యూఢిల్లీగా ప్రచారం చేస్తూ దుష్ప్రచారానికి ఒడిగట్టారు. ఈ వ్యవహారం అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపడంతో భారత విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యవహారంపై భారత విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ అంశంపై వస్తున్న మీడియా కథనాలను మేం పరిశీలించాం. ఏ దేశం గురించైనా ఇలాంటి వక్రీకరించిన, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం దురదృష్టకరం. బంగ్లాదేశ్‌లోని ఢాకా ప్రాంతాలను భారతదేశంలోని ఢిల్లీగా చూపిస్తున్న విదేశీ శక్తుల తీరు వారి విశ్వసనీయతనే దెబ్బతీస్తుంది. ఇలాంటి తప్పుడు కథనాలను నడిపించే వ్యక్తులు, వారి వెనుక ఉన్న శక్తుల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం’’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

150 మందికి పైగా చైనా వ్లాగర్లు.. నెలల తరబడి కుట్ర

దాదాపు 150 మందికి పైగా చైనా జాతీయులు బంగ్లాదేశ్‌లోని టెక్‌పారా, ఉత్తర వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మకాం వేశారు. తెల్లవారుజాము నుంచే అర్ధరాత్రి వరకు అక్కడి మురికివాడలు, చెత్తకుప్పలు, కాలువలను లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు.

ఢాకా కాలువను ఢిల్లీగా చూపించి: చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన మియాన్‌మియాన్ అనే మహిళ ఉత్తర సెక్టార్ 12లోని ఓ కాలువ పక్కన నిలబడి లైవ్ స్ట్రీమింగ్ చేసింది. ఆ ప్రాంతాన్ని న్యూఢిల్లీ అని తన చైనా వీక్షకులకు పరిచయం చేస్తూ.. ఇక్కడి ఇళ్లు అపరిశుభ్రంగా, వెనుకబడి ఉన్నాయని అసత్యాలు ప్రచారం చేసింది.

టీలో ఆవు మూత్రం అంటూ విద్వేష వ్యాఖ్యలు: టెక్‌పారాలోని ఓ టీ స్టాల్ వద్ద మరో చైనా వ్లాగర్ లైవ్ చేస్తూ.. స్థానికులు తాగే టీలో ఆవు మూత్రం కలుపుతారంటూ తీవ్ర అభ్యంతరకర, అవమానకర వ్యాఖ్యలు చేశాడు. భారతదేశ ఆహారపు అలవాట్లు, పారిశుధ్యం, జీవన ప్రమాణాలను కించపరుస్తూ వీక్షకులను తప్పుదోవ పట్టించారు.

మే 2026 నుంచే నెట్‌వర్క్.. స్థానిక మహిళలకు రోజువారీ కూలీ..

ఈ దుష్ప్రచారం ఏదో ఒక్కరోజుతో ముగిసింది కాదు. మే 2026 నుంచే ఈ తరహా నెట్‌వర్క్ ఢాకాలో చురుగ్గా పనిచేస్తున్నట్లు సమాచారం. చైనా వ్లాగర్లకు సహకరించేందుకు స్థానిక బంగ్లాదేశ్ మహిళలను గైడ్లుగా నియమించుకున్నారు. స్థానిక గైడ్ రీతూ అక్తర్ మాట్లాడుతూ.. వీరికి సహాయం చేసినందుకు రోజుకు 700 నుంచి 800 టాకాలు కూలీగా ఇస్తున్నారని వెల్లడించారు. పేదరికంలో ఉన్న ప్రాంతాలను టార్గెట్ చేసుకుని, స్థానికులకు డబ్బు ఆశ చూపి ఈ డ్రామా నడిపిస్తున్నారు.

డోయిన్, వియ్‌చాట్‌లలో భారత్‌పై క్రమబద్ధమైన దాడి

ఈ వీడియోలను చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన డోయిన్, వియ్‌చాట్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇది కేవలం పేదరికాన్ని చూపించడం మాత్రమే కాదని.. భారత్‌పై అంతర్జాతీయ సమాజంలో వ్యతిరేకత పెంచేందుకు, భారత ప్రతిష్టను దిగజార్చేందుకు చైనా వేదికగా సాగుతున్న సమన్వయపు కుట్ర అని స్పష్టమవుతోంది. సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే లక్షల మందికి తప్పుడు సమాచారం చేరుతుండటంతో దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని భారత్ పట్టుబడుతోంది.

Follow Us
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
బంగ్లాదేశ్ మురికివాడలను ఢిల్లీగా చూపిస్తూ చైనా వ్లాగర్ల..
ఖురాన్ లేదా బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
ఖురాన్ లేదా బైబిల్‌ను మార్చే ధైర్యం ఉందా? శక్తిమాన్ తీవ్ర ఆగ్రహం
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
మీ ఆఫీస్ నుంచి లోన్ తీసుకుంటున్నారా..? ట్యాక్స్ రూల్స్ ఇవే..
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
అల్యూమినియం ఫాయిల్ ఎలా వాడాలి?మెరిసే వైపు మంచిదా లేక మ్యాట్ వైపా?
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..