AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్ మరో బెంగళూరు కానుందా..? ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం ఇదే

కోట్లు కుమ్మరించి విలాసవంతమైన ఫ్లాట్లు కొంటున్నారు.. కానీ ఉదయం లేస్తే గుక్కెడు నీటి కోసం ట్యాంకర్ల వైపు దీనంగా చూస్తున్నారు. ఆకాశాన్ని తాకే గేటెడ్ కమ్యూనిటీలు, గ్లాస్ బిల్డింగులతో ప్రపంచ పటంలో మెరిసిపోతున్న హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఇప్పుడు వింత సంక్షోభం మొదలైంది. ఒకప్పుడు ఇల్లు కొనాలంటే రోడ్లు, మెట్రో, స్కూళ్లు ఉన్నాయా అని చూసేవారు.. కానీ ఇప్పుడు రోజూ తాగడానికి నీళ్లు వస్తాయా? అని భయపడుతూ అడగాల్సిన దుస్థితి. పశ్చిమ హైదరాబాద్‌ను ముంచెత్తుతున్న నీటి కష్టాల అసలు కథేంటో తెలుసుకుందాం..

Hyderabad: హైదరాబాద్ మరో బెంగళూరు కానుందా..? ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం ఇదే
Hyderabad Water Crisis
Siva Nagaraju
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 9:50 PM

Share

కోట్లు పెట్టి అపార్ట్‌మెంట్లు కొంటున్నారు. గుక్కెడు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. బోర్లు ఎండిపోతున్నాయి. ట్యాంకర్లే దిక్కవుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాద్‌లో ఇల్లు కొనాలంటే రోడ్డు ఉందా, స్కూలు ఉందా, ఐటీ కంపెనీ ఎంత దూరంలో ఉందని చూసేవారు. ఇప్పుడు మరో ప్రశ్న కూడా అడగాల్సిన పరిస్థితి వస్తోంది. ఆ అపార్ట్‌మెంట్‌కు నీళ్లు వస్తాయా. కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్నా రోజూ గుక్కెడు నీటి కోసం ట్యాంకర్ వైపు చూడాల్సి వస్తే ఆ ఇంటి విలువ ఎంత. ఎత్తైన భవనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలు పుట్టుకొస్తున్నాయి. కానీ వాటికి అవసరమైన నీటి వనరులు మాత్రం పెరగడం లేదు. ఒకవైపు బోర్లు ఎండిపోతున్నాయి. మరోవైపు ట్యాంకర్ల కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. నిన్నటివరకు ఐటీ ఉద్యోగాలకు చిరునామాగా ఉన్న పశ్చిమ హైదరాబాద్. ఇప్పుడు నీటి కష్టాలకు కేంద్రంగా మారుతోందా. రేపు ఇదే పరిస్థితి నగరమంతా విస్తరిస్తే హైదరాబాద్ బతుకులు ఎలా ఉంటాయి. ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, నల్లగండ్ల, నానక్‌రామ్‌గూడ, మణికొండ, తెల్లాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో నీటి అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హాస్టళ్లు, పీజీలు ఎక్కువగా ఉండటంతో రోజువారీ వినియోగం పెరిగింది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీల్లో రోజుకు లక్ష నుంచి లక్షన్నర లీటర్ల నీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకుంటున్న పరిస్థితి ఉంది. ట్యాంకర్ల కోసం ముందుగానే బుకింగ్ చేయాల్సి వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ఐటీ కారిడార్‌లో ట్యాంకర్ల క్యూ వెనుక అసలు నిజం..
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
ప్రభాస్ ఒక్కరోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా.. ?
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
OTTలో ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఫ్రీగా చూడొచ్చు
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
మళ్లీ కరోనా కలకలం.. ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ పంజా..
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
8 నెలల పసి బిడ్డను చంపి తల్లి మృతి! సూసైడ్ నోట్‌లో సంచలన విషయాలు
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
ట్రాఫిక్ పోలీసులు బైక్ తాళాలు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే..
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
పేదల తిరుపతిలో బ్రహ్మోత్సవ వైభవం.. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టొద్దు.. అసదుద్దీన్ ఒవైసీ
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
ఆరోగ్యానికి అమృతం ఇది! బరువు తగ్గడం నుంచి చర్మ సౌందర్యం వరకు
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం
విశాఖ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేషన్ సేవలు రద్దు.. ఇకపై భోగాపురం