Traffic Rules: మీ బైక్ తాళాలు ట్రాఫిక్ పోలీసులు లాక్కోవచ్చా..? ఈ రూల్స్ తెలిస్తే మీరు సేఫ్.. ఎవరూ ఏం చేయలేరు..
రోడ్డుపై మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినప్పుడు బైక్ లేదా కారు తాళాలు ట్రాఫిక్ పోలీసులు లాక్కుతున్నారా.. వారికి అలాంటి అధికారం ఉంటుందని అనుకుంటున్నారా.. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నారు. ఈ రూల్స్ తెలుసుకోవడం వల్ల మీరు ఈజీగా బయటపడవచ్చు.

ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై తనిఖీలు చేపడుతూ ఉంటారు. రోడ్లపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ లాంటి కాగితాలు ఉన్నాయా.. లేదా అనేది పరిశీలిస్తున్నారు. ఇక హెల్మెట్ ధరించకపోయినా, ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినా మీ వాహనాన్ని నిలిపివేస్తారు. మీరు రోడ్డుపై వాహనంపై వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఆపితే టెన్షన్ పడాల్సిన పని లేదు. కొన్నిసార్లు పోలీసులు బైక్ లేదా కారు తాళాలను తీసుకోవడం, వాహనాన్ని తీసుకెళ్లడం, నిర్బంధించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వాహనదారులకు ఉండే చట్టపరమైన హక్కుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీరు ట్రాఫిక్ పోలీసుల నుంచి బయటపడవచ్చు.
ట్రాఫిక్ పోలీసులు తాళాలను తీసుకోవచ్చా..?
మోటారు వాహనాల చట్టం ప్రకారం మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉన్నపళంగా తాళాలు లాక్కొవడం కుదరదు. బలవంతంగా తాళాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్దం. కేవలం మిమ్మల్ని ఆగమని పోలీసులు ఆదేశించవచ్చు. ఒకవేళ మీ కారు లేదా బైక్ తాళాలను తీసుకుంటే వీడియో రికార్డ్ చేయండి. మీరు వారితో వాదించకుండా ప్రశాంతంగా ఉండండి. వీడియో రికార్డు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయండి.
చలాన్ వేసే అధికారం ఉందా..?
పోలీసులు సాధారణంగా చలాన్లు వేస్తుంటారు. అయితే ప్రతీ ట్రాఫిక్ పోలీసులు ఛలాన్ వేసే అధికారం ఉండదు. అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్, సబ్ ఇన్‌స్పెక్టర్, ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారులకు మాత్రమే చలాన్లు జారీ చేసే అధికారం ఉంటుంది. మిగతా ట్రాఫిక్ కానిస్టేబల్స్ వారికి సహాయంగా ఉంటారు. ఒకవేళ మీకు చలాన్ వేస్తుంటే వారి గుర్తింపును తనిఖీ చేయండి. చలాన్ జారీ చేసే అధికారి వద్ద ఎలక్ట్రానిక్ పరికరం లేదా చలాన్ రసీదు ఉందో.. లేదో చెక్ చేసుకోండి. మీరు వెంటనే జరిమానా చెల్లిస్తే రసీదు తీసుకోండి. రసీదు లేకపోతే చలాన్ చెల్లించకండి.
వాహనం తీసుకెళ్లవచ్చా..?
మీరు తప్పుడు పార్కింగ్ చేసినప్పుడు పోలీసులు వాహనం తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అయితే మీరు కారులో కూర్చోని ఉంటే తీసుకెళ్లానికి అనుమతి ఉండదు. మీ వాహనం వల్ల తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంటే వాహనాన్ని వెంటనే లాక్కెళ్లవచ్చు. ఇక పోలీసులు మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటే 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలి. పోలీస్ అధికారి మిమ్మల్ని వేధిస్తుంటే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. లేదా ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేయవచ్చు. రోడ్డుపై పోలీసులు ఆపగానే చాలామంది భయపడుతుంటారు. తాళం లాక్కోని మీకు ఇవ్వకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ మీరు ఈ చట్టపరమైన నిబంధనలు తెలుసుకుంటే వాటి నుంచి బయటపడవచ్చు.
