వందే భారత్ స్లీపర్ రైల్లో పెంపుడు జంతువులు తీసుకెళ్లొచ్చు.. ఛార్జీలు ఎంతంటే..?
Venkatrao Lella
Images: Pinterest
10 NOV 2026
వందే భారత్ స్లీపర్ రైళ్లు దేశంలో అందుబాటులోకి వస్తున్నాయి. అయితే మిగతా రైళ్లతో పోలిస్తే ఈ రైళ్లల్లో అనేక సదుపాయాలు ఉన్నాయి. రిజర్వేషన్ బుకింగ్, ఇతర సౌకర్యాలు భిన్నంగా ఉంటాయి.
వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో డాగ్స్, పిల్లి లాంటి పెంపుడు జంతువులను మీరు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంది. అంతేకాదు వీటి కోసం కోచుల్లో ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పిస్తారు. జంతు ప్రేమికులకు ఇది ప్రయోజనం చేకూరుస్తోంది.
పెంపుడు జంతువుల కోసం పెట్ బాక్స్, ఎన్‌క్లోజర్ లాంటివి ఏర్పాటు చేశారు. తలుపు, గడియతో కూడిన బోను లాంటి ఈ బాక్సులో పెట్స్‌ను ఉంచవచ్చు. నీరు, ఆహారం కోసం బాక్సులో ప్రత్యేక హోల్డర్లు కూడా ఉంటాయి.
రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు పెంపుడు కుక్కలు, పిల్లితో ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అయితే ప్రత్యేక డాగ్ బాక్సుల్లో వీటిని ఉంచడం వల్ల సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల ఇతర ప్రయాణికులకు కూడా ఇబ్బంది ఉండదు.
అయితే పెంపుడు జంతువులను తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కన్పార్మ్‌డ్ టికెట్ కలిగి ఉండాలి. ఒక పీఎన్ఆర్‌పై ఒక పెంపుడు జంతువును మాత్రమే అనుమతిస్తారు. కుక్కపిల్లలు, పిల్లిపిల్లలను తీసుకెళ్లవచ్చు.
ఫస్ట్ క్లాస్‌లో పూర్తి 4-బెర్త్‌ల క్యాబిన్ లేదా 2-బెర్త్‌ల కూపే బుక్ చేసుకుంటే మాత్రమే పెంపుడు కుక్కలను తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది. లగేజీ ఛార్జీ, కార్గో ఛార్జీల్లో భాగంగా రుసుంలు వసూలు చేస్తారు.
బ్రేక్ వ్యాన్ లేదా ప్రత్యేక డాగ్ బాక్స్‌లో తీసుకెళ్లడానికి 30 కిలోగ్రాముల బరువు ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. ఫస్ట్ క్లాసులో 60 కిలోగ్రాముల బరువు ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. కొన్ని రైళ్లలో ఈ సౌకర్యం ఉండకపోవచ్చు.
అయితే వందే భారత్ స్లీపర్ రైళ్లలో తీసుకెళ్లాలంటే కొన్ని పత్రాలు సమర్పించాలి. ప్రయాణానికి 24 నుండి 48 గంటల ముందు జారీ చేసి పశువైద్య ధృవీకరణ పత్రం, టీకాల పత్రాలు పార్శిల్ కార్యాలయంలో అందించాలి.
పార్శిల్ కార్యాలయ సిబ్బంది పరిశీలించి అనుమతి మంజూరు చేస్తారు. లగేజీ రూల్స్ ప్రకారం ఛార్జీలు వసూలు చేస్తారు. అనంతరం ట్రైన్ లోపలోకి తీసుకెళ్లవచ్చు.