AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్‌కు పోటీగా వస్తున్న ఆ బాలీవుడ్ హీరో

ప్రభాస్‌కు పోటీగా వస్తున్న ఆ బాలీవుడ్ హీరో

Lakshminarayana Varanasi
| Edited By: |

Updated on: Nov 10, 2026 | 4:56 PM

Share

ప్రభాస్‌, రణ్‌బీర్‌ కపూర్‌ తమ రాబోయే సినిమాల లైనప్‌లో సీక్వెల్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభాస్‌ చేతిలో ‘కల్కి 2’, ‘సలార్‌ 2’ ఉండగా, రణ్‌బీర్‌ ‘బ్రహ్మాస్త్ర 2’, ‘యానిమల్‌ 2’, ‘రామాయణం పార్ట్‌ 2’తో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీక్వెల్స్‌తో భారీ విజయాలు అందుకున్న ప్రభాస్‌ బాటలో రణ్‌బీర్‌ కూడా నడుస్తున్నారు. ఈ ఇద్దరి సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రభాస్, రణ్‌బీర్ కపూర్ మధ్య ఓ పోలిక ఉంది.. ఇండియన్ సినిమాలో ఈ ఇద్దరు మాత్రమే హీరో ఆఫ్ సీక్వెల్స్‌గా మారిపోతున్నారు. ఒకప్పుడు సినిమా అంటే ఒకే పార్ట్ ఉండేది కానీ.. ఈ ఇద్దరు హీరోలు మాత్రం సీక్వెల్స్ ఉన్న కథలకే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వీళ్ళ లైనప్ చూస్తుంటే ఈ సీక్వెల్స్ ట్రెండ్ ఇప్పట్లో బయటపడేలా లేరు. మరి ఆ సీక్వెల్స్ ఏంటో చూద్దామా..? ప్రభాస్ అంటేనే కేరాఫ్ సీక్వెల్స్ అయిపోయారిప్పుడు. బాహుబలి 2 పార్ట్స్ ఫార్ములాను కంటిన్యూ చేస్తూ నాగ్ అశ్విన్‌తో కల్కి 2 చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైపోయింది. సలార్ 2 సినిమా కూడా ఎన్టీఆర్‌తో చేస్తున్న డ్రాగన్ పూర్తయిన వెంటనే స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. అటు బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ కూడా ఏమాత్రం తగ్గకుండా సీక్వెల్స్ ఉన్న కథలకే ఓటేస్తున్నారు. అసలు బ్రహ్మాస్త్ర 2 సినిమా ఉంటుందా లేదా అనే డౌట్స్ అందరిలో ఉన్న టైమ్‌లో.. ఆ ప్రాజెక్ట్ పక్కాగా ఉందని ఈ హీరో కన్ఫర్మ్ చేశారు. అలాగే ఆయన హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక రామాయణ పార్ట్ 2 సినిమా కూడా 2027 దీపావళి కానుకగా థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది. వీటితో పాటు బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యానిమల్ సీక్వెల్‌ యానిమల్ 2 కూడా రణ్‌బీర్ కపూర్ చేతిలోనే ఉంది. సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్ సినిమా చేస్తున్నారు.. అది పూర్తవ్వగానే యానిమల్ 2 మొదలు కానుంది. ఇలా ప్రభాస్, రణ్‌బీర్ కపూర్ ఇద్దరూ కూడా తమ లైనప్‌లో మూడేసి సీక్వెల్స్‌తో బాక్సాఫీస్‌పై దండయాత్ర చేయడానికి రెడీ అయిపోయారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్

కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు

హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి

ఆర్టీసీ – మెట్రో ఉమ్మడి పాస్‌ ధర భారీగా తగ్గింపు

నిరుద్యోగ యువతకు.. గుడ్‌న్యూస్‌

Published on: Nov 10, 2026 04:55 PM
Follow Us