మాస్ స్టెప్పులతో రప్ఫాడిస్తున్న హీరోయిన్లు
టాలీవుడ్ సినిమాల్లో మాస్ పాటలకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్లు ప్రత్యేక డ్యాన్స్ నంబర్లతో సందడి చేస్తున్నారు. ‘టైసన్ నాయుడు’లో నేహా శెట్టి ‘మద్రాసీ రబ్బరు బొమ్మ’ పాటతో ఆకట్టుకోగా, ‘ఇడుపు కాయితం’లో నాగదుర్గ మాస్ స్టెప్పులతో వైరల్ అవుతున్నారు. బాలకృష్ణ ‘దాదా’ సినిమాలో నర్గీస్ ఫక్రీ ‘దాదా ధమాకా’ పాటతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాట నవంబర్ 13న విడుదల కానుంది.
రెగ్యులర్ సాంగ్స్ కంటే మాస్ సాంగ్స్ ఎప్పుడూ ఆడియన్స్‌కి త్వరగా కనెక్ట్ అవుతాయి. ఈ విషయం హీరోయిన్లకు కూడా బాగా అర్థమైపోయింది. అందుకే క్లాస్ లుక్స్ పక్కనపెట్టి ఊర మాస్ స్టెప్స్‌తో రచ్చ చేసేందుకు బ్యూటీస్ అంతా గట్టిగా పోటీ పడుతున్నారు. అదిరిపోయే మాస్ నెంబర్స్‌తో స్క్రీన్ మీద రప్ఫాడించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఆ మాస్ సాంగ్స్ ఏంటో మనమూ చూద్దామా..? ప్యారడైజ్ పాట ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే కదా..! తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న టైసన్ నాయుడులో డీజే టిల్లు బ్యూటీ నేహా శెట్టి మద్రాసీ రబ్బరుబొమ్మ అంటూ తన మాస్ స్టెప్స్‌తో స్క్రీన్ మీద రచ్చ చేసారు. భీమ్స్ ట్యూన్స్‌కు ఈ పాటలో బెల్లంకొండతో కలిసి అదిరిపోయే డాన్సులేసారు నేహా శెట్టి. ఇన్‌స్టంట్‌గా ఈ పాట ఎక్కేసింది. ప్రియదర్శి హీరోగా వస్తున్న ఇడుపు కాయితం సినిమాలో కూడా ఒక అదిరిపోయే మాస్ బారాత్ మేకర్స్ రెడీ చేశారు. నాగదుర్గ తనదైన స్టైల్‌లో ఇరగదీసిన మాస్ స్టెప్స్ ఇప్పటికే విపరీతంగా వైరల్ అవుతూ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి. యూ ట్యూబ్‌లో ఇలాంటి మాస్ సాంగ్స్ చాలా చేసిన దుర్గ.. సిల్వర్ స్క్రీన్‌పై మొదటిసారి తన స్వాగ్ చూపిస్తున్నారు. ఇక బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న దాదా సినిమాలో నర్గీస్ ఫక్రీ దాదా ధమాకా అనే స్పెషల్ మాస్ నెంబర్ చేస్తున్నారు. నవంబర్ 13న ఈ పాట రానుంది. రీసెంట్‌గా జైలర్ 2లో బిందాస్ అనే మాస్ సాంగ్ చేసారు నర్గీస్. ఇక బాలయ్య, గోపీచంద్ కాంబో వీరసింహారెడ్డిలో అదిరిపోయే మాస్ సాంగ్స్ ఇచ్చారు. మొత్తానికి ఆడియన్స్‌కు తమ మాస్ స్టెప్పులతో స్క్రీన్ మీద సాలిడ్ ట్రీట్ ఇస్తున్నారు ఈ బ్యూటీస్ అంతా..!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఐపీఎల్ 2027లో ఊహించని మలుపు.. పంజాబ్‌కు హార్దిక్, ముంబయికి అర్ష్‌దీప్
కిలాడీ లేడీలు.. మాటల్లో పెట్టి మాయం చేసారు
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
హాయిగా నిద్రపోండి.. లక్షలు సంపాదించండి
భారీ మొసలి కలకలం.. భయాందోళనలో జనం!
మహిళా ఉద్యోగులకు రూ.3 లక్షల విలువైన ఐఫోన్ గిఫ్ట్..
ఆటో ఎక్కితే అంతే సంగతులు.. మహిళలే టార్గెట్
షాపులోకి సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన అనుకోని అతిథి
బిడ్డ రక్షణ కోసం తల్లి తపన.. ఆకట్టుకుంటున్న వీడియో
మ్యాగీ అమ్మి రోజుకు రూ.14 వేలు సంపాదన

