AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: వివాహేతర సంబంధం చుట్టూ తిరిగే కథ.. OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.3 రేటింగ్

థియేటర్లలో పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ సినిమా ఓటీటీలో మాత్రం ఆకట్టుకుంటోంది. వివాహేతర సంబంధాల కారణంగా నలుగురి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది ఈ సినిమా ప్రధాన కథాంశం. ఐఎమ్ డీబీలోనూ 8.3 రేటింగ్ ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండ్ అవుతోంది.

OTT Movie: వివాహేతర సంబంధం చుట్టూ తిరిగే కథ.. OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్.. IMDBలో 8.3 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 13, 2026 | 9:37 PM

Share

గత వారం ఓటీటీలో పలు కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రాధిక శరత్ కుమార్ తాయ్ కిళవి, ఆది పిని శెట్టి శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై తదితర సినిమాలు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఒక తెలుగు సినిమా ఇప్పుడు టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. వివాహేతర సంబంధాలకు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది. మార్చి 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా ఆడియన్స్‌కు రీచ్ కాలేదు. స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో త్వరగానే థియేటర్లలో నుంచి ఈ మూవీ వెళ్లిపోయింది. ఇప్పుడు దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేసింది. ఎమోషనల్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు ఐఎమ్ డీబీలో ఏకంగా 8.3 రేటింగ్ ఉండడం గమనార్హం. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. లాయర్ అయిన అలెక్స్‌కు హేమతో పెళ్లవుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో తన భర్తతో అందమైన జీవితం ఊహించుకుంటుంది హేమ. అయితే, అలెక్స్ తన ఆఫీస్‌లో పని చేసే సోఫియాతో అఫైర్ పెట్టుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న హేమ అలెక్స్ ను వదిలేసి వెళ్లిపోతుంది. అదే సమయంలో సోఫియా వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉండడం చూసి అలెక్స్ తాను మోసపోయినట్లు గ్రహిస్తాడు. క్షమించమని అడిగేందుకు మళ్లీ తన భార్య దగ్గరకు వెళ్తాడు.

అయితే, హేమ జీవితంలోకి అప్పటికే ఆమె ఫ్రెండ్ రోషన్ వస్తాడు. అతన్ని స్నేహితుడిగానే హేమ భావించినా… రోషన్ మాత్రం వేరే ఉద్దేశంతో చూస్తాడు. తన భర్తను అర్థం చేసుకుని అలెక్స్‌కు దగ్గరవుతుందనుకుంటున్న టైంలో హేమ జీవితంలో ఊహించని ఘటన జరుగుతుంది. మరి అదేంటి? రోషన్, హేమ, అలెక్స్, సోఫియాల జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమా పేరు డార్క్ నైట్. జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూర్ణ ప్రధాన పాత్రలో నటించింది. త్రిగుణ్, విదార్థ్, శుభశ్రీ రాయగురు తదితరులు కీలక పాత్రలు పోషించారు. పట్లోళ్ల వెంకట్ రెడ్డి సమర్పణలో పి 19 స్టూడియోస్ బ్యానర్‌పై సురేష్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహాలో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర