AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీని షేక్ చేస్తోన్న సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ఈ వీకెండ్ లో ఓ మంచి థ్రిల్లింగ్ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే మీకు ఈ మూవీ ఓ మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు. గత వారమే (ఏప్రిల్ 10) డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తోంది.

OTT Movie: ఒళ్లు గగుర్పొడిచే సీన్స్.. ఓటీటీని షేక్ చేస్తోన్న సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 12, 2026 | 7:41 PM

Share

ఎప్పటి లాగే గత వారం ఓటీటీలో బోలెడన్ని కొత్త సినిమాలు, ఆసక్తికర వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. రాధిక శరత్ కుమార్ తాయ్ కిళవి, ఆది పిని శెట్టి శబ్దం, డార్క్ నైట్, ఓ రోమియో, తూ యా మై తదితర సినిమాలు ఇప్పుడు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తున్నాయి. అయితే ఇందులో ఇక ఇంగ్లిష్ సినిమా కూడా ఉంది. ఇదొక సర్వైవల్ థ్రిల్లర్. ప్రస్తుతం ఇంగ్లిష్ తో పాటు తెలుగు తదితర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఆసక్తికరమైన కథా కథనాలు, ఒళ్లు గగుర్పొడిచే సీన్లు, ఊహించని ట్విస్టులు, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే.. ఇలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ కు మస్త్ మజా ఇవ్వబోతోంది. ఈ సినిమా కథ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక వైపు కుంభ వృష్టి, మరోవైపు రాకాసి అలలు కలిసి ఓ తీర ప్రాంత పట్టనంపై విరుచుకు పడతాయి. దెబ్బకు ఊరంతా చెరువులా మారిపోతుంది. ఇళ్లన్నీ నీటితో నిండిపోతాయి. అక్కడ నివాసమున్న జనాలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటారు. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ వరద నీళ్లలోకి ఒక్కసారిగా షార్క్ చేపలు ఎంట్రీ ఇస్తాయి. కంటికి కనిపించిన వారందరినీ ఆ షార్క్ లు పీక్కుతింటుంటాయి. ఇదే క్రమంలో ఓ నిండు గర్భిణి కూడా ఈ వరద నీటిలో చిక్కుకుంటుంది. ఒకవైపు పురిటి నొప్పులు, మరోవైపు చుట్టూ తిరుగుతున్న షార్క్స్.. ఈ ప్రమాదకర పరిస్థితి నుంచి ఆమె తనను, తన బిడ్డను ఎలా కాపాడుకుంది అన్నదే ఈ సినిమా కథ

ప్రస్తుతం ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ట్రాష్’ (Thrash). టామీ విర్కోలా తెరకెక్కించిన ఈ సినిమాలో ఫోబ్ దైనేవర్, డిజిమోన్ హౌన్సౌ, విట్నీ పీక్ ప్రధాన పాత్రల్లో నటించారు. మొదట ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలకున్నారు. కానీ వివిధ కారణాలతో డైరెక్టుగా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సినిమా ఇంగ్లిష్ తో పాటు తెలుగు తదితర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వీకెండ్ లోఒక మంచి థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ట్రాష్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. .

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర