AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tiger Prabhakar: వందల సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయాడో తెలుసా? పాపం చివరి రోజుల్లో ఎవరూ తోడు లేక..

కన్నడ ప్రభాకర్ అలియాస్ టైగర్ ప్రభాకర్ కొన్ని వందల సినిమాల్లో నటించారు. విలన్ గానూ, హీరోగానూ మెప్పించారు. సినిమాల్లో సక్సెస్ అయిన ప్రభాకర్ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. చాలా చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.

Tiger Prabhakar: వందల సినిమాల్లో నటించిన ఈ విలన్ ఎలా చనిపోయాడో తెలుసా? పాపం చివరి రోజుల్లో ఎవరూ తోడు లేక..
Tiger Prabhakar
Basha Shek
|

Updated on: Apr 10, 2026 | 9:10 PM

Share

టైగర్ ప్రభాకర్.. అలియాస్ కన్నడ ప్రభాకర్.. ఈ తరం సినిమా ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చేమో కానీ.. 1980-90 దశకం ఆడియెన్స్ కు ఈ నటుడు బాగా పరిచయం. టైగర్ ప్రభాకర్.. ఈ పేరుకు తగ్గట్టుగానే మంచి శరీర సౌష్టవం ఆయన సొంతం. అయితే చూడ్డానికి హీరోలా ఉండే కన్నడ ప్రభాకర్ ఎక్కువగా విలన్ పాత్రలతోనే బాగా ఫేమస్ అయ్యారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, తమిళం, హిందీ చిత్రాల్లో విలన్ గా చేశారాయ. ఓవరాల్ గా సుమారు 450 సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో యుగంధర్, ఇద్దరూ అసాధ్యులే, చుట్టాలున్నారు జాగ్రత్త, బిల్లా రంగ, చట్టానికి కళ్లు లేవు, పులి బెబ్బులి, ధర్మ పోరాటం, పులి, జ్వాలా, విక్రమ్ ,పోలీస్ అధికారి, రావణ బ్రహ్మ, కిరాతకుడు, రాక్షసుడు, రాక్షస సంహారం, పసివాడి ప్రాణం, జేబు దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి, నేటి సిద్దార్థ, కొదమ సింహం, నిప్పురవ్వ..ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు కన్నడ ప్రభాకర్. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే కచ్చితంగా ఈ విలన్ ఉండాల్సిందే. తన నటనా ప్రతిభకు ఎన్నో అవార్డులు, బిరుదులు అందుకున్నారు ప్రభాకర్.

సినిమాల్లో స్టార్ విలన్ గా ఓ వెలుగు వెలిగారు కన్నడ ప్రభాకర్. అయితే వ్యక్తిగత జీవితంలో తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొన్నారాయన. ముఖ్యంగా వైవాహిక జీవితం విషయంలో ఆయన తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇతను ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నారని ప్రచారం లో ఉంది. 1985 లో ప్రముఖ నటి అలాగే రాజకీయ నాయకురాలు అయిన జయమాలని పెళ్లి చేసుకున్నారు ప్రభాకర్. కొన్నాళ్లకు వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో విడిపోయారు. మధ్యలో ఇండస్ట్రీతో సంబంధం లేని మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని విడిపోయాడు. ఆ తర్వాత 1995 లో నటి అంజుని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో కూడా కలిసుండలేక విడిపోయారు.

ఈ క్రమంలో 2000 వ సంవత్సరంలో జాండిస్ బారిన పడ్డారు ప్రభాకర్. ఆ మరుసటి ఏడాదే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అప్పటికింకా ప్రభాకర్ వయసు కేవలం 52 సంవత్సరాలు మాత్రమే. ఇక్కడ విషాదకరమైన విషయం ఏమిటంటే.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ ప్రభాకర్ చివరి రోజుల్లో ఏ ఒక్కరూ కూడా తోడుగా లేకపోవడం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
అభివృద్ధి, సంక్షేమంపై కూటమి సర్కార్ ప్రోగ్రెస్ కార్డ్!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
జిమ్ లేకుండా ఫిట్‌గా ఉండాలా? ఈ మసాలా పొడి ప్రయోజనాలు తెలుసుకోండి!
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
తేలు పిల్లలు పుట్టగానే తల్లిని తినేస్తాయా..? మీకు తెలియని నిజాలు
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
కూరలో నూనె ఎక్కువైందా? రోజూ పెరుగు పుల్లగా అవుతుందా..
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
బ్యాంకు నుంచి రూ.11 లక్షల పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే EMI, వడ్డీ ఎంత
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
మీ మెదడు అలసిపోయిందో.. లేదో.. ఎలా తెలుసుకోవాలి..?
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇవాళే OTTలోకి వచ్చేసిన 300 కోట్ల బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ...
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
ఇరాన్‌తో చారిత్రాత్మక ఒప్పందం దిశగా అమెరికా..!
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
భారీ గ్రహల సంచారం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు
మొదటి దోశ అంటుకుపోతుందా?డోంట్‌ వర్రీ..హోటల్ స్టైల్ క్రిస్పీ దోశలు