AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dacoit Movie: అడివి శేష్ ‘డెకాయిట్’ సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..

అడివి శేష్ హీరోగా తెరకెక్కిన డెకాయిట్ సినిమా రేపు (ఏప్రిల్ 10) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. యాక్షన్ కమ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా కనిపించనున్నాడు.

Dacoit Movie: అడివి శేష్ 'డెకాయిట్' సినిమాను రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్ హీరో ఎవరో తెలుసా? ఆ ఒక్క కారణంతో..
Dacoit Movie
Basha Shek
|

Updated on: Apr 09, 2026 | 8:23 PM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో అడివి శేష్ నటించిన లేటెస్ట్ సినిమా డెకాయిట్. షానీల్ డియో తెరకెక్కించిన ఈ లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ మూవీతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఇందులో ఆయన పవర్ ఫుల్ విలన్ రోల్ చేశారు. వీరితో పాటు ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోన్న ఈ సినిమా ఎట్టకేలకు రేపు (ఏప్రిల్ 10) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో డెకాయిట్ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద సుప్రియ నిర్మించిన డెకాయిట్ సినిమాలో మొదట శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఆమె తోనే కొన్ని సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే ఏమైందో తెలియదు కానీ అనూహ్యంగా ఈ మూవీ నుంచి శ్రుతి హాసన్ తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలో మృణాళ్ ఠాకూర్ ను తీసుకుని ఈ ప్రేమ కథా చిత్రాన్ని పూర్తి చేశారు మేకర్స్.

అయితే హీరోయిన్ విషయంలోనే కాదు హీరో విషయంలోనూ ఇలాంటిదే ఒకటి జరిగిందట. డెకాయిట్ సినిమా కథని మొదట అక్కినేని హీరో అయిన అఖిల్ కి వినిపించారట మేకర్స్. అయితే వివిధ కారణాలతో అఖిల్ ఈ సినిమాను చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదట. దాంతో మేకర్స్ ఈ కథను అడివి శేషు దగ్గరికి తీసుకెళ్లారట. అతను కథ విని కొన్ని మార్పులు, చేర్పులు సూచించి మూవీ చేసేందుకు ఒకే చెప్పారట. అలా డెకాయిట్ సినిమా పట్టాలెక్కిందట.

ఇవి కూడా చదవండి

కాగా టాలీవుడ్ లో డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు చేస్తున్నాడు అడివి శేష్. క్షణం, ఎవరు, గూడచారి, మేజర్, హిట్ 2 వంటి సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. హీరోగా శేష్ కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే హిట్ 2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అడివి శేష్ ఇప్పుడు డెకాయిట్ మూవీతో ఆడియెన్స్ ముందుకు రానున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే