Allu Arjun Raaka Movie: ‘రాకా’ అంటే అర్థం ఏంటో తెలుసా? బన్నీ సినిమాకు ఈ టైటిల్ పెట్టడానికి కారణమిదేనా?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూసిన అప్డేట్ వచ్చింది. పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ నటించే సినిమా టైటిల్ ఖరారైపోయింది. ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్‌తో రూపొందించిన ఈ చిత్రాన్ని ఇకపై 'రాకా' అనే పేరుతో తెరకెక్కించునున్నారు.

పుష్ప 2 వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అల్లు అర్జున్ నటిస్తోన్న సినిమా అంటే సహజంగానే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా తన తర్వాతి సినిమాను అట్లీ కుమార్ తో ప్లాన్ చేశాడు బన్నీ. అలాగే బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణెను హీరోయిన్ గా తీసుకున్నారు. తమిళంలో భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 800 కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కాగా గతేడాదే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ను ఇప్పటి వరకు వర్కింగ్ టైటిల్‌తో నే చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 08)ను పురస్కరించుకుని ఈ క్రేజీ ప్రాజెక్టు మూవీ టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. అల్లు అర్జున్- అట్లీ సినిమాకు రాకా అనే ఫుల్ మాస్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మేరకు బుధవారం రిలీజ్ చేసిన టైటిల్‌తో పాటు రిలీజ్ చేసిన పోస్టర్ సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ రాకా సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు రాకా అంటే అర్థమేంటని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.
కాగా ప్రతి నెలలో వచ్చే పౌర్ణమిని రాకా అని పిలుస్తారు. చీకటి, చెడుపై యుద్ధం చేసిన హీరో విజయానికి ప్రతీకగానే బన్నీ సినిమాకు రాకా పేరు పెట్టినట్లు కొంత మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో మనిషి, మృగం కలగలిపిన రాక పోస్టర్ చూస్తుంటే.. రాక్షసుడనే అర్థం వచ్చేలా టైటిల్ ఎంచుకున్నారా? అని మరికొందరు తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. . పౌర్ణమి రోజు మనుషులు తోడేళ్లుగా మారుతారనే అపోహలు కూడా ఉన్నాయని ఈ మూవీ కూడా అలాంటిదేనా అని ప్రశ్నలు సంధిస్తున్నారు. వీటితో పాటు రాకా అంటే క్రూరత్వం, ప్రమాదకరం, హింస అన్న అర్థాలు కూడా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. ఏదేమైనా ఈ ఆసక్తికర టైటిల్‌పై ఎవరికీ తోచింది వారు తమకు నచ్చినట్లుగా అర్థాలు చెబుతున్నారు. మరి ఈ ‘రాకా’ కు అసలు అర్థమేంటో మేకర్స్ చెప్తే కానీ ఒక క్లారిటీ వచ్చేలా లేదు.
ALLU ARJUN – DEEPIKA PADUKONE – ATLEE FILM TITLED ‘RAAKA’ – TITLE POSTER UNVEILED… Looks absolutely STUNNING… On the occasion of #AlluArjun‘s birthday, director #Atlee and #SunPictures have officially revealed the title of their much-anticipated film: #Raaka.
Mounted on a… pic.twitter.com/7oIFtmVUCW
— taran adarsh (@taran_adarsh) April 8, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




