AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi: ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా? ఇద్దరూ ఒక సినిమా కూడా చేశారు

ఈ సంక్రాంతికి మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన విజయ పరంపరను కొనసాగిస్తూ ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ లతో మరో మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్నారీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

Anil Ravipudi: ఈ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా? ఇద్దరూ ఒక సినిమా కూడా చేశారు
Anil Ravipudi
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 8:32 PM

Share

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరని చెప్పవచ్చు. ఎందుకంటే ది గ్రేట్ రాజమౌళి తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయమెరుగని దర్శకుడు అనిల్ రావిపూడినే. పటాస్ మొదలుకొని మొన్నటి మన శంకరవర ప్రసాద్ గారు వరకు ఈ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారు సినిమా టాలీవుడ్ రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఏకంగా 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రీజియన్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డుల కెక్కింది. అందుకే ఇప్పుడు అనిల్ రావిపూడితో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు కూడా ఆసక్తి చూపపిస్తున్నారు. అయితే అనిల్ మాత్రం మరోసారి తన ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ తోనే జత కట్టాడు. అలాగే తనకు డైరెక్టర్ గా మొదటి ఛాన్స్ఇచ్చిన కల్యాణ్ రామ్ తో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే సినిమాల సంగతి తప్పితే అనిల్ రావిపూడి పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. ఈ క్రమంలో ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న ఓ ముద్దుగుమ్మ ఈ డైరెక్టర్ కు కోడలు అవుతుంది. ఈ విషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడినే ఓ సందర్భంలో పంచుకున్నారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరనుకుంటున్నారా?

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన సినిమా భగవంత్ కేసరి. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తే బాలయ్య కూతురిగా శ్రీలీల కీలక పాత్రలో మెరిసింది. ఈ సినిమా ప్రమోషన్లలోనే శ్రీలీలతో తనకున్న బంధుత్వాన్ని బయటపెట్టారు అనిల్‌ రావిపూడి. శ్రీలీల తనకు వరసకు అక్క కూతురు అవుతుందని చెప్పుకొచ్చారు. అదెలాగంటే.. శ్రీలీలది సొంత రాష్ట్రం కర్ణాటక. అయితే ఆమె తల్లి డాక్టర్‌ స్వర్ణ సొంతూరు మాత్రం ఒంగోలు దగ్గరలో ఉన్న పొంగులూరు. డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి సొంతూరు కూడా ఇదే నట. శ్రీలల పెరిగింది, చదువుకున్నదంతా బెంగళూరు, అమెరికాల్లోనే అయినా.. సెలవుల్లో ఏటా పొంగులూరు వచ్చేదట. చాలా రోజుల పాటు తన అమ్మమ్మ దగ్గరే ఉండేదట. ఇక శ్రీలీల తల్లి అనిల్‌ రావిపూడికి స్వయనా కజిన్‌ సిస్టర్‌ అవుతారట. అంటే శ్రీలీల అనిల్‌కు కోడలు వరుస అన్నమాట.

ఇవి కూడా చదవండి

శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

కాగా భగవంత్‌ కేసరి షూటింగ్ సెట్‌లో తాము బంధువులమనే విషయాన్ని దాచిపెట్టారట శ్రీలీల, అనిల్ రావిపూడి. అయితే సెట్స్‌లో అందరి ముందూ అనిల్‌ను డైరెక్టర్ గారు అని పిలిచే శ్రీలీల.. ఎవరూ లేనప్పుడు మాత్రం ‘మామయ్య’ అంటూ ఆట పట్టించేదట.

View this post on Instagram

A post shared by SREELEELA (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఈ టాలీవుడ్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా?
ఈ టాలీవుడ్ హీరోయిన్ అనిల్ రావిపూడికి కోడలు అవుతుందని తెలుసా?
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ
4000 కోట్ల రూపాయల అద్భుతం: 'రామాయణ' గ్లోబల్ బిజినెస్ స్ట్రాటజీ
వంటింట్లో సమస్యకు చెక్! ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇక కన్నీళ్లు రావు
వంటింట్లో సమస్యకు చెక్! ఉల్లిపాయలు కోసేటప్పుడు ఇక కన్నీళ్లు రావు
రామాయణ Vs ఆదిపురుష్... తప్పు దిద్దుకుంటారా ??
రామాయణ Vs ఆదిపురుష్... తప్పు దిద్దుకుంటారా ??
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
అందుకే శ్రీదేవి నకు నచ్చేది కాదు.! అంతా ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
హెల్మెట్ పెట్టు.. బహుమతి పట్టు.. వాహనదారులకు పోలీసుల బంపర్ ఆఫర్..
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
మామిడి పండ్లు ఇలా తింటే ఆస్పత్రికి పరుగెత్తాల్సిందే
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
93 కోట్ల వ్యూస్‌..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు పాట
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
మీ జీవిత భాగస్వామిని ఎంచుకునేటప్పుడు ఈ విషయాలు మర్చిపోకండి..
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!
కుజుడి ప్రభావంతో కుభేరులయ్యే రాశులివే.. మీ రాశి ఉందో చూడండి!