AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devayani: సినిమాల్లోకి దేవయాని కూతురు.. ‘కోర్ట్’ రీమేక్‌తో ఎంట్రీ.. ప్రియాంక లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించింది దేవయాని. పెళ్లై, పిల్లలైన తర్వాత కూడా సినిమాలు చేస్తోన్న ఆమె ఇప్పుడు హీరో, హీరోయిన్లకు తల్లిగా, అత్తమ్మగా, అక్కగా, వదినగా నటిస్తుంది. అయితే ఇప్పుడు దేవయాని సినీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

Devayani: సినిమాల్లోకి  దేవయాని కూతురు.. 'కోర్ట్' రీమేక్‌తో ఎంట్రీ.. ప్రియాంక లేటెస్ట్ ఫొటోస్ ఇదిగో
Devayani
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 9:28 PM

Share

తెలుగులో చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం కోర్ట్. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రంలో రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. అలాగే ప్రియదర్శి పులికొండ కీలక పాత్రలో మెప్పించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను ఇప్పుడు కోలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. రంజన్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్, నటి దేవయాని వారసురాలు ప్రియాంక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా దేవయానినే వెల్లడించింది. సోమవారం (ఏప్రిల్ 04) రంజన్ మూవీ లాంఛ్‌కు హాజరైన దేవయాని తన కూతురికి ‍అవకాశమిచ్చిన త్యాగరాజన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. తన లాగే తన కూతురు సినిమా ఇండస్ట్రీలో రాణిస్తుందని దేవయాని ధీమా వ్యక్తం చేసింది.

కాగా దేవయాని విషయానికి స్తే..తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది ముఖ్యంగా తెలుగులో ఆమె పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ గా నటించిన సుస్వాగతం సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత కూడా పలు హిట్ సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార. శ్రీమతి వెళ్లొస్తా, మాణిక్యం, చెన్నకేశవ రెడ్డి, నాని, ఆయనే మా ఆయన, జనతా గ్యారేజ్, లవ్ స్టోరీ తదితర సినిమాల్లో యాక్ట్ చేసింది దేవయాని.

ఇవి కూడా చదవండి

ఇక దేవయాని భర్త కూడా సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. అజిత్, పార్తీబన్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఆయన ప్రస్తుతం నటుడిగా కొనసాగుతున్నాడు. ఇక దేవయాని- రాజ్ కుమార్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పేరు ఇనియ, చిన్న కూతురు పేరు ప్రియాంక. వీరిలో ఇనియకు ఇప్పటికే సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. జీ సరిగమప వంటి సింగింగ్ రియాలిటీ షోల్లోనూ పాల్గొంది. ఇక ఇప్పుడు చిన్న కూతురు ఏకంగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో దేవయాని ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.

రంజన్ మూవీ లాంఛింగ్ ఈవెంట్ లో కూతురితో దేవయాని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!