AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Song: 93 కోట్ల వ్యూస్‌తో సంచలనం..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు సాంగ్.. వింటే మైమరచిపోతారు

800 మిలియన్ల వ్యూస్ (80 కోట్ల) వ్యూస్ తో యూట్యూబ్ లో సరికొత్త రికార్డు సృష్టించింది రానూ బొంబాయికి రానూ ఫోక్ సాంగ్. అయితే ఈ పాటకు మించి ఓ తెలుగు సినిమా సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే ఈ సాంగ్ కు ఏకంగా 937 మిలియన్ల (93 కోట్ల) వ్యూస్ వచ్చాయి.

Trending Song: 93 కోట్ల వ్యూస్‌తో సంచలనం..ఇప్పటికీ యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న తెలుగు సాంగ్.. వింటే మైమరచిపోతారు
Allu Arjun Pooja Hegde Butta Bomma Song
Basha Shek
|

Updated on: Apr 06, 2026 | 7:58 PM

Share

మొన్నటికి మొన్న ‘రానూ బొంబాయికి రానూ’ అనే ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో 800 మిలియన్ల వ్యూస్ (80 కోట్ల ) వ్యూస్ ను అధిగమించింది. తద్వారా తెలుగు జానపదాల్లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న పాటగా ఇది రికార్డుల కెక్కింది. బిగ్ బాస్ ఫేమ్ రామూ రాథోడ్ స్వయంగా లిరిక్స్ పాడిన ఈ పాట ప్రస్తుతం తెలుగు ఫోక్ సాంగ్స్ లో ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. కానీ ఈ పాటకు మించి ఒక తెలుగు సినిమా సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఈ పాట వచ్చి సుమారు ఆరేళ్లయ్యింది. ఇప్పటివరకు ఏకంగా 93 కోట్ల వ్యూస్ తో రికార్డులు కొల్లగొడుతూనే ఉంది. ఇప్పటివరకు తెలుగు సినిమా పాటల్లోనే ఈ పాటనే అత్యధిక వ్యూస్‌ని సాధించడం విశేషం. మరి ఇంతకీ ఆ పాట ఏదనుకుంటున్నారా? ఐకాన్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘అల వైకుంఠపురములో’.. 2020లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ సినిమా విజయానికి ప్రధాన కారణం ఇందులోని పాటలే. సామజవరగమన, బుట్ట బొమ్మ, రాములో రాములా వంటి సాంగ్స్ పెద్ద హిట్టైయ్యాయి. ఇక అందులో బుట్ట బొమ్మ సాంగ్ అయితే నెక్ట్స్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ వేసిన స్టైలిష్ స్టెప్పులకు థియేటర్లలోప్రేక్షకులు కూడా స్టెప్పులేశారు.

ఈ బుట్ట బొమ్మ సాంగ్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులోని స్టెప్స్ చాలా ఈజీగా ఉంటాయి. అందుకే చాలా మంది ఈ పాటను రీక్రియేట్ చేశారు. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో లక్షలాది మంది ఈ సాంగ్ తో రీల్స్, వీడియోలు చేయడంతో `బుట్టబొమ్మ` పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యాన్స్ తో పాటు పూజా పాప గ్లామర్ కూడా హైలెట్ గా నిలిచింది. ఇక తమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే గాయకుడు అర్మాన్ తన మధురమైన గాత్రంతో ఈ పాటకు ప్రాణం పోశాడని చెప్పవచ్చు. వీరితో పాటు రామజోగయ్య శాస్త్రి తన కలంతో ఈ పాటలోని లిరిక్స్ అందరికీ అర్థమయ్యేలా అందంగా వ్యక్తపరిచారు. అందుకే ఈ పాట వచ్చి ఆరేళ్లయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇప్పటివరకు ఈ సాంగ్ కు సుమారు 937 మిలియన్ల వ్యూస్ (93 కోట్ల వ్యూస్) వచ్చాయి. తద్వారా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న తెలుగు సినిమా పాటగా బుట్టబొమ్మ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ సాంగ్ జోరు ఇప్పటిలా ఆగేలా కనిపించడం లేదు. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు కొల్లగొడుతుందని చెప్పవచ్చు. త్వరలోనే ఈ సాంగ్ ఒక బిలియన్‌ వ్యూస్‌ని దాటబోతుందని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

బుట్ట బొమ్మ వీడియో సాంగ్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!