AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Geetha Singh: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అని నమ్మించి.. షాకింగ్ విషయం బయట పెట్టిన కితకితలు హీరోయిన్

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోన్న గీతా సింగ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అదే సమయంలో సినిమాల పరంగా తాను ఎదుర్కొన్న అవమానాలను షేర్ చేసుకుంది.

Geetha Singh: ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అని నమ్మించి.. షాకింగ్ విషయం బయట పెట్టిన  కితకితలు హీరోయిన్
Actress Geetha Singh
Basha Shek
|

Updated on: Apr 08, 2026 | 9:47 PM

Share

గీతా సింగ్.. తెలుగు సినీ ప్రియులకు ఈ నటి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన కితకితలు సినిమాలో హీరోయిన్ గా నటించి కడుపుబ్బా నవ్వించిందామె. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటిగా గీతాసింగ్ అలరించింది. సినిమాల్లో ఎక్కువగా కామెడీ పాత్రల్లో నటించి నవ్వించే ఈ బొద్దుగుమ్మ నిజ జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడింది. సొంత వాళ్ల చేతిలోనే మోసపోయి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంది. చివరకు కంటికి రెప్పలా పెంచుకున్న కుమారుడు ఓ ప్రమాదంలో చనిపోవడంతో గీతా సింగ్ బాగా తల్లడిల్లిపోయింది. మానసికంగా కుంగిపోయి చాలా రోజుల పాటు ఇంటికే పరిమితమైపోయింది. అయితే ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో కనిపిస్తోంది. అలాగే ఇంటర్వ్యూలకు కూడా హాజరువుతోంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఒక ఇంటర్వ్యూకు హాజరైన గీతా సింగ్ తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే క్రమంలో సినిమాల పరంగా తాను అవమానాలు ఎదుర్కొన్నానంటూ వాపోయింది.

‘టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ దగ్గర పని చేస్తోన్నకొందరు కో -డైరెక్టర్లు నన్ను కలిశారు. ఓ మూవీలో ఒక క్రేజీ రోల్ ఉందని చెప్పారు. రవితేజ పక్కన ఉండే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పడంతో బాగా ఎగ్జైట్ అయ్యాను. దాని కోసం ఏకంగా నెల రోజుల పాటు డేట్స్ అడ్జస్ట్ చేశాను. ఆ సినిమాలో నటించాలన్న ఇంట్రెస్ట్ తో వేరే సినిమా ఆఫర్లను కూడా వదులుకున్నాను. కానీ తీరా షూటింగ్ టైమ్ దగ్గరపడ్డాక టీమ్ నుంచి ఎలాంటి ఉలుకూ పలుకూ లేదు. కో-డైరెక్టర్ల నెంబర్లు సంపాదించి ఎన్నిసార్లు కాల్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. ఏదో పొరపాటు జరిగిందేమో అని సరిపెట్టుకున్నాను. తీరా సినిమా రిలీజ్ అయ్యాక థియేటర్‌కు వెళ్లి చూస్తే నా మైండ్ బ్లాక్ అయ్యింది. నాకు చెప్పిన అదే పాత్రలో మరో నటిని చూసి చాలా బాధ పడ్డాను. కనీసం నాకు సమాచారం కూడా ఇవ్వకుండా వేరే వాళ్లతో ఆ సీన్లు చేయించడం ఏ మాత్రం సరైన పద్ధతి కాదు. ఒక నటిగా నాకు రావాల్సిన గౌరవం ఇవ్వలేదు. నా సమయాన్ని వృథా చేశారు’ అని గీతా సింగ్ వాపోయింది. ప్రస్తుతం ఈ నటి కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

గీతా సింగ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
ఎండకాలంలో ట్యాంక్ నీరు గీజర్‌లా వస్తోందా? ఈ మెరిసే పేపర్‌ ట్రిక్‌
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
గొంతు నొప్పికి చెక్ పెట్టె పురాతన కాలం నాటి అల్లం చట్నీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
మోడ్రన్ గౌన్ల హడావుడికి చెక్ పెట్టిన ‘హీరామండి’ బ్యూటీ
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
అన్నం కూర ఎందుకు దండగ.. 20 నిమిషాల్లో తయారయ్యే ఈ రెసిపీ ఉండగా
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
స్వదేశాన్ని ఛీకొట్టిన పాక్ ప్లేయర్.. ఐపీఎల్ వేలంలోకి ఎంట్రీ?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్.. వాతావరణం ఎలా ఉంటుంది..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
స్టార్ కపుల్ నివాసం ‘శివశక్తి’ స్పెషాలిటీస్ తెలుసా..?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఎన్టీఆర్ 'డ్రాగన్'మూవీని రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
మీ బైక్‌ పోయిందా? అయితే, ఇక్కడే ఉండొచ్చు!టూ వీలర్‌ ముఠాను అరెస్ట్
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!
సూర్య సంచారంతో అదృష్టం మారే 4 రాశులు..! వీరిపైనే డబ్బుల వర్షం!