AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peddi Movie: ఆ నలుగురు హీరోలు నో అన్నారా? రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'పెద్ది'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ క్రికెటర్ గానూ, పహిల్వాన్ గానూ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

Peddi Movie: ఆ నలుగురు హీరోలు నో అన్నారా? రామ్ చరణ్ 'పెద్ది' సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎవరో తెలుసా?
Peddi Movie
Basha Shek
|

Updated on: Apr 08, 2026 | 9:13 PM

Share

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘పెద్ది’. ‘ఉప్పెన’ సినిమాతో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు బుచ్చి బాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ మెగా మూవీకి స్వరాలు సమకూరుస్తున్నారు. పక్కా రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతోన్న పెద్దిలో రామ్ చరణ్ క్రికెటర్ గానూ, కుస్తీ యోధుడిగానూ కనిపించనున్నాడు. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజైన టీజర్ మెగా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించింది. అంతకు ముందు వచ్చిన గ్లింప్స్, సాంగ్స్ కు కూడా సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. కాగా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ది సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్ కు దగ్గర పడుతోన్న సమయంలో ఈ మెగా మూవీ గురించి ఒక ఆసక్తికర వార్త వినిపిస్తోంది. అదేంటంటే.. పెద్ది సినిమాకు రామ్ చరణ్ ఫస్ట్ ఛాయిస్ కాదంట. రామ్ చరణ్ కంటే ముందే బుచ్చిబాబు ఈ కథను నలుగురు స్టార్ హీరోలకు వినిపించారట. అయితే వివిధ కారణాలతో వాళ్లు నో చెప్పారట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. పెద్ది సినిమాను రిజెక్ట్ చేసిన హీరోల్లో ఒక బాలీవుడ్ స్టార్ కూడా ఉన్నాడట.

బుచ్చిబాబు పెద్ది సినిమాను మొదట జూనియర్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నాడట. అయితే అప్పటికే ఎన్టీఆర్ వివిధ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడట. దీంతో ఈ మూవీపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. దీంతో బుచ్చిబాబు ఒక బాలీవుడ్ హీరో ను సంప్రదించారట. అయితే ఆ హీరోకి ఈ కథ పెద్దగా నచ్చలేదట. దీంతో ఈ సినిమా చేసేందుకు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదట. ఆ బాలీవుడ్ హీరో ఎవరంటే చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ అని తెలుస్తోంది. అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం మాత్రమే. ఇందులో ఎంత నిజముందనేది తెలియదు. ఇంతకు ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్యలు కూడా పెద్ది సినిమాను రిజెక్ట్ చేశారని రూమర్లు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

పెద్ది సినిమాలో రామ్ చరణ్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
అప్పట్లో వేప చెట్టు కింద కూర్చొని ఈ వడలనే తినేవాళ్లు.. భలే చలువ
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే..
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
మహిళలకు ఇది కదా కావాల్సింది..ఒక్క రోజులోనే భారీగా పడిపోయిన బంగారం
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
వామ్మో.. పాము పగ అంటే ఇట్లుంటదా.. వ్యక్తిని వెతికిమరీ 3 సార్లు..
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
ఇంగ్లాండ్ సిరీస్ కోసం తుది జట్టులో మార్పులు ఇవే
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
మీరు కొనే మటన్ ముదురా.. లేతదా? ఇలా ఒక్క ముక్కతోనే గుర్తించండి
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐపీఎల్‌లో తోపువే కావొచ్చు.. ఇక్కడ జీరోవే
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఐర్లాండ్ చేతిలో పరాజయానికి 2 ప్రధాన కారణాలు చెప్పిన గవాస్కర్
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఆరోగ్యం అనుకుని మీరు తింటున్న ఈ ఆహారాలే గుండెను ఏం చేస్తున్నాయో..
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!
ఇక పెట్రోల్ బైకులు రోడ్లపై కనిపించవా..? సంచలన నిర్ణయం..!