AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: 75కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు.. ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్

ఇతర జానర్లతో పోల్చితే సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు హాలీవుడ్ లోనే ఎక్కువగా తెరకెక్కుతుంటాయి. అయితే ఈ మధ్యన తెలుగులోనూ ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా 75 ఇంటర్నేషనల్ అవార్డులు అందుకున్న ఒక సైకలాజికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా గురించే.

OTT Movie: 75కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులు.. ఓటీటీలో మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్ థ్రిల్లర్.. IMDBలోనూ టాప్ రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 08, 2026 | 7:45 PM

Share

ఓటీటీలో అన్ని రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. లవ్, కామెడీ, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్, హారర్.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తుంటాయి. వీటిలో ఎక్కువగా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఆడియెన్స్ కు ఎక్కువగా థ్రిల్ పంచుతుంటాయి. అయితే ఈ జానర్ సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ లోనే తెరకెక్కుతుంటాయి. అలాగే బాలీవుడ్ లోనూ ఓ మోస్తరుగా వస్తుంటాయి. అయితే ఈ మధ్యన తెలుగులోనూ ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా అలాంటి సినిమా గురించే. ఈ సినిమా థియేటర్లలో విడుదల కాకముందే, అనేక ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్‌లో అవార్డులను గెలుచుకుంది. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా 75కు పైగా ఇంటర్నేషనల్ అవార్డులను గెలుచుకుని రికార్డు సృష్టించింది. ఈ సినిమా కథ కూడా ఇంట్రెస్ట్రింగ్ గా, థ్రిల్లింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా ఇందులోని ట్విస్ట్ లు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తాయి. ఈ సినిమా కథ సింధు అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమెకు సంపత్ అంటే పిచ్చి ప్రాణం. ఇద్దరూ ప్రేమించుకుంటున్న సమయంలో సడన్ గా ఒకరోజు సంపత్ అదృశ్యమైపోతాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న సింధును తీసుకెళ్లి ఒక మెంటల్ ఆస్పత్రిలో పడేస్తారు.

సినిమాలో అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఆ మెంటల్ ఆస్పత్రిలో అంత వింత వింతగా జరుగుతుంటుంది. ఎవరో బూచోడు తనను చంపడానికి వస్తున్నట్లు, అక్కడ దెయ్యాలు ఉన్నట్లు సింధుకు అనిపిస్తుంటుంది. దీనికి తోడు ఆస్పత్రిలో ఉండే ఉండే డాక్టర్లు, స్టాఫ్ కూడా ఏదో దాస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. మరి సింధు లవర్ ఏమైపోయాడు? చివరికి సింధు ఆస్పత్రి నరకం నుంచి బయటపడిందా? లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా పేరు ‘ఫియర్’. హరిత గోగినేని తెరకెక్కించిన ఈ సినిమాలో హీరోయిన్ వేదిక కీలక పాత్ర పోషించింది. అరవింద్ కృష్ణ, అనీష్ కురువిల్లా, పవిత్రా లోకేష్, సయాజీ షిండే, సత్య కృష్ణన్ తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. ప్రస్తుతం ఫియర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో మంచి సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి ఫియర్ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
నక్కజిత్తుల చైనా.. కుట్ర బట్టబయలు.. బ్రిటన్ మిలిటరీకే కన్నం..
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఫ్రిజ్‌లో పెట్టిన ఆహారం మళ్లీ వేడి చేసి తింటున్నారా?
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ఇథనాల్ బ్లెండింగ్‌పై రాజకీయ దుమారం.. కిషన్ రెడ్డి కౌంటర్
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము.. ఒక్క కాటుతో 100మంది ఖతం!
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఇడ్లీ, దోశకు కొత్త చట్నీ కావాలా?.. బెండకాయతో ఈ పచ్చడి చేసి చూడండి
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్.. 
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
జస్ప్రీత్ బుమ్రా లేని లోటును తీర్చబోతున్న యంగ్ పేసర్
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
విపరీతంగా జుట్టు రాలుతోందా? కారణం ఈ విటమిన్ లోపమే కావచ్చు!
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?
పెరుగన్నం తిన్న వెంటనే కునుకు ఎందుకు వస్తుంది?.. ఇందులో నిజమెంత?