AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raaka Movie: అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ‘శక్తి’.. విషయమేమిటంటే?

అల్లు అర్జున్ పుట్టిన రోజు (ఏప్రిల్ 08) పుట్టిన రోజు సందర్భంగా అతని కొత్త సినిమాకు 'రాకా' అని టైటిల్ ఖరారు చేశారు. ఈ అనౌన్స్ మెంట్ వచ్చినప్పటినుంచి రాకా పేరు సోషల్ మీడియాలో మార్మోగుతోంది. ఇదే క్రమంలో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ శక్తి కూడా తెరమీదకు వచ్చింది.

Raaka Movie: అల్లు అర్జున్ 'రాకా' సినిమా.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ 'శక్తి'.. విషయమేమిటంటే?
Raaka Movie
Basha Shek
|

Updated on: Apr 09, 2026 | 9:54 PM

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 08) ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ ని ఇలాంటి గెటప్ లో అసలు ఊహించలేదని, బాక్సాఫీస్ దగ్గర మరోసారి రప్పా రప్పా ఖాయమని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ సుమారు రూ. 800 కోట్ల భారీ బడ్జెట్ తో రాకా సినిమాను నిర్మిస్తోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొణె ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. కాగా రాకా సినిమా పేరు అనౌన్స్ చేసినప్పటి నుంచి దీని మీనింగ్ ఏంటో తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్త చూపిస్తున్నారు. ఇదే క్రమంలో అనూహ్యంగా డైరెక్టర్ మెహర్ రమేష్ ట్రెండింగ్ లోకి వచ్చారు. అల్లు అర్జున్ రాకా సినిమాకు మెహర్ కు ఎలాంటి సంబంధం లేదు. కానీ ఈ టైటిల్ తో ఆయనకు ఒక రిలేషన్ ఉంది.

మెహర్ రమేష్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా శక్తి. 2011లో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్ గా నిలిచింది. వైజయంతీ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీని ఎన్టీఆర్ తో సహా అతని అభిమానులెవరూ అంత ఈజీగా మర్చిపోలేదు. స్వయంగా తారక్ సైతం కొన్ని ఇంటర్వ్యూలలో ఈ సినిమాను గుర్తు చేస్తూ తనపై తానే సెటైర్లు వేసుకుంటారు. ఇక నిర్మాత అశ్వినీ దత్ అయితే, శక్తి సినిమా నష్టాలను పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు. అలాంటి శక్తి సినిమా ఇప్పుడు రాకా కారణంగా మరోసారి వార్తల్లో నిలిచింది. దీనికి కారణమేమిటంటే..

ఇవి కూడా చదవండి

తెర మీదకు ఎన్టీఆర్ శక్తి సినిమా..

View this post on Instagram

A post shared by ft.bunty (@buntygaadu_)

ఎన్టీఆర్ నటించిన ‘శక్తి’ సినిమాలో విలన్ పేరు రాకా. అందులో ఆ పాత్రని బాగా పవర్ ఫుల్ గా చూపించారు డైరెక్టర్ మెహర్ రమేశ్. హీరో తరహాలో భారీ ఎలివేషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే విలన్ పేరుని అల్లు అర్జున్ సినిమాకి టైటిల్ గా పెట్టారు. దీంతో నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ ఓపెన్ చేస్తే చాలు రాకాకు సంబంధించిన ఫన్నీ మీమ్సే కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, అల్లు అర్జున్ లు తమ సినిమాల్లో మెహర్ రమేష్ రిఫరెన్స్ గా తీసుకున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..