AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: అడవిలో శవం.. ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్

ప్రస్తుతం మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఓటీటీలో అయితే మలయాళం సినిమాలను ఎగబడి చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు మలయాళం సినిమాలను తెలుగులోకి డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నాయి.

OTT Movie: అడవిలో శవం.. ఓటీటీలో మలయాళం బ్లాక్ బస్టర్ సస్పెన్స్ థ్రిల్లర్‌.. తెలుగులోనూ స్ట్రీమింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Apr 09, 2026 | 9:28 PM

Share

ప్రజెంట్ ఓటీటీల్లో క్రైమ్ స్టోరీస్, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటోంది. అందులోనూ మలయాళం సినిమాలైతే మరీ డిమాండ్ ఉంటోంది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలు, వెబ్ సిరీస్ లను డబ్బింగ్ చేసి మరీ తెలుగులోనూ స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమానే. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ కంటెంట్ బేస్డ్ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. మిస్ట‌రీ హార‌ర్ అంశాల‌కు టైమ్ ట్రావెల్ పాయింట్‌ను జోడించి తెరకెక్కిన ఈ సినిమాను చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కర్ణాట‌క – కేర‌ళ స‌రిహ‌ద్దుల్లో అట‌వీ ప్రాంతంలో ఉన్న పోలీస్‌ స్టేష‌న్‌కు బదిలీ అవుతాడు ఆనంద్‌ . అదే పోలీస్‌స్టేషన్‌లో రెజీ, స్టీఫెన్ అనే పోలీసులు పని చేస్తుంటారు. ఒక రోజు వీరు నైట్‌డ్యూటీకి వెళ్లగా అడ‌విలో ఓ శవం క‌నిపిస్తుంది. అయితే ఆ మృత‌దేహం ద‌గ్గ‌ర‌కు వెళ్లిన వాళ్లందరూ ఓ ఆల‌యంలో చిక్కుకుపోతారు. ఆ విషయం తెలుసుకుని అడ‌విలోకి వ‌చ్చిన ఆనంద్, అత‌డి టీమ్‌కు చిత్ర విచిత్రమైన అనుభవాలు ఎదురవుతాయి. మరి ఇంతకీ ఆ డెడ్ బాడీ ఎవరిది? ఎవరు హత్య చేశారు? కాకి ఆకారంలో ఉన్న ఆలయం వెనక ఉన్న ఆ మిస్టరీ ఏంటి? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠ కలిగించే సన్నివేశాలు, ఊహకు అందని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు సంభవం అధ్యాయం ఒన్ను. జీతూ సతీషన్‌ తెరకెక్కించిన ఈ మూవీలో అస్క‌ర్ అలీ, వినీత్ కుమార్‌, అస్సిమ్ జ‌మాల్‌, సిద్ధార్థ్ భ‌ర‌త్ తదితరులు కీలక పాత్ర‌ల్లో న‌టించారు. మార్చిలో థియేటర్లలో రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్ స్టార్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15 నుంచి ఈ సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ కు రానుంది. ఈ మేరకు జియో హాట్ స్టార్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఒరిజినల్ వెర్షన్ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది.

తెలుగులోనూ మలయాళం బ్లాక్ బస్టర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆర్మీ ఆయుధాలు చోరీ..
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
వైభవ్ మార్క్ డామినేషన్.. తానేంటో మరోసారి ప్రూవ్ చేసిన వండర్ కిడ్
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
చుట్టూ ఉన్నవన్నీ కొట్టుకుపోయినా ఆ ఇల్లు ఎలా నిలబడింది? రహస్యం ఇదే
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత..
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
ఉక్రెయిన్‌పై భారత్‌ స్టాండ్‌ మరోసారి క్లియర్!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
రోడ్ల దుస్థితిపై వ్యక్తి వినూత్న నిరసన..!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
లోన్ EMI చెల్లించకపోతే ఫోన్ లాక్ అవుతుందా? ఆర్బీఐ కొత్త రూల్స్‌!
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
100 ఏళ్లైనా బుడ్డోడి ఈ డేంజరస్ రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్
కోతుల బెడదకు ఎలుగుబంటి అవతారం,పత్తి పంటకు రక్షణగా సరికొత్త ట్రిక్