తొమ్మిది నెలలుగా  సైలెంట్ గా ఉన్న మృణాల్ ఠాకూర్ 

10 November 2026

Rajeev 

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల్లు అర్జున్ సినిమా ‘రాకా’లో మృణాల్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  

రాకా సినిమాలో ఛాన్స్‌పై ఆసక్తి.. ఈ సినిమాలో మృణాల్ పేరు వినిపిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

 దాదాపు తొమ్మిది నెలలుగా కొత్త సినిమాలకు సంతకం చేయలేదని మృణాల్ వెల్లడించింది.

కేవలం స్టార్ హీరోలు, దర్శకులను చూసి సినిమాలు ఒప్పుకోవడం లేదని, తన పాత్రకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.

 మంచి పాత్రల కోసం ఎదురుచూస్తుంది మృణాల్. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే పాత్రలు చేయాలన్నది మృణాల్ ఆలోచన.

 ‘దో దీవానే షహర్ మే’, ‘డెకాయిట్’, ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’, ‘పూజా మేరీ జాన్’ వంటి సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకులను పలకరించింది.

 సీతారామం, ‘హాయ్ నాన్న’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. హిందీ సినిమాల్లోనూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.