AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలా..? ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఈ నెలాఖరు నాటికి..

AndhraPradesh: విద్యుత్ శాఖపై జరిపిన చర్చలో సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. పీఎం సూర్య ఘర్ కింద మరింత మందికి కనెక్షన్లు కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ నెలాఖరుకు 9 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్లు అందించాలని తాజా రివ్యూ మీటింగ్‌లో ఆదేశించారు.

ఇంటిపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలా..? ఏపీ ప్రభుత్వం బిగ్ డెసిషన్.. ఈ నెలాఖరు నాటికి..
Pm Surya Ghar
Venkatrao Lella
|

Updated on: Nov 18, 2026 | 5:12 PM

Share

ఇంధన శాఖపై తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎం సూర్య ఘర్ పథకంపై కీలక ప్రకటన చేశారు. ఈ పథకం అమలులో దేశంలో నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు. ఇప్పటి వరకు 7.42 లక్షలకు పైగా రూఫ్‌టాప్ సోలార్ ఇన్‌స్టాలేషన్లు పూర్తి చేస్తామన్న చంద్రబాబు.. ఈ నెలాఖరుకు 9 లక్షల పీఎం సూర్యఘర్ కనెక్షన్ల ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. పీఎం కుసుమ్ పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల పనుల్లో పురోగతి ఉందని, ఈ ప్రాజెక్టుల్లో భూసేకరణ 100 శాతం పూర్తి అవ్వగా.. సివిల్ పనుల్లో 91 శాతం పురోగతి జరిగిందన్నారు. ఈ కీలక సమీక్షకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ శాఖ అధికారులు హాజరయ్యారు. గత రెండున్నరేళ్లలో ఇంధన రంగంలో జరిగిన పెట్టుబడులు, నూతన ప్రాజెక్టుల స్థితిగతులపై చర్చ జరిగింది. ఎల్‌నివో  కారణంగా పెరిగిన విద్యుత్ వినియోగం, డిమాండ్-సప్లైపై అధికారులతో చర్చించారు.

ఈ సమావేశంలో గ్రీన్ ఎనర్జీ కారిడార్-3, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు, ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు తదితర అంశాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. విశాఖ సమ్మిట్‌లో ఇంధన రంగంలో వచ్చిన పెట్టుబడులు, ఆ ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చ జరిగింది. ఈ సమీక్షలో అధికారులు కీలక అంశాలను చంద్రబాబుకు వివరించారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ 14,852 మెగావాట్లకు చేరే అవకాశం ఉందని, ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు గత ఏడాదితో పోలిస్తే విద్యుత్ డిమాండ్ 18.23 శాతం పెరిగిందని నివేదిక అందించారు. ఎల్‌నినో ప్రభావంతో విద్యుత్ డిమాండ్‌‌లో అనూహ్య పెరుగుదల నమోదైందని, గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద ఏపీలో రూ.21,838 కోట్లతో భారీ విద్యుత్ సరఫరా వ్యవస్థకు ప్రణాళికలు రూపొందించామన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ ద్వారా 47 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరాకు అవకాశముందని, రాష్ట్రంలో 36,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటు చేేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.

పోలవరం పరిసరాల్లో 27 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ప్రాంతాల గుర్తింపు జరిగిందని, తద్వారా 36,050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. విద్యుత్ రంగంలో జూన్ 2024 నుంచి 103 ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా.. వీటి ద్వారా రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. విశాఖ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో విద్యుత్ రంగంలో రూ.2.56 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్లలో రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామని, 2,962 విద్యాసంస్థలను సౌర విద్యుత్ పరిధిలోకి తెచ్చే ప్రణాళిక ఉందని వివరించారు.

Follow Us
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!
13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం..
13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం..