AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం..

జీవితం పూలబాట కానప్పుడు.. కష్టాల ముళ్లబాటలోనే చిరునవ్వుతో అడుగులు వేసేవాళ్లే నిజమైన యోధులు.. ఒకవైపు ఇద్దరు పసిబిడ్డల బాధ్యత.. మరోవైపు బతుకు పోరాటం కోసం చెత్త సేకరించే వాహనపు స్టీరింగ్.. నిర్మల్‌కు చెందిన అశ్వినిగణేశ్ చూపిస్తున్న ధైర్యం, అమ్మతనం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది.

Telangana: చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం..
Inspiring Story Of Ashwini Ganesh From Nirmal
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 18, 2026 | 5:11 PM

Share

జీవితం అందరికీ పూలబాట పరచదు.. కొందరికి ముళ్లబాటలోనే పయనించడం నేర్పిస్తుంది. కష్టాలు ఎదురైనా కుంగిపోకుండా.. కన్నీళ్లు వచ్చినా చెదిరిపోకుండా.. బాధ్యతల బరువును చిరునవ్వుతో మోసేవారే నిజమైన జీవిత పోరాట యోధులు. అలాంటి ఓ మాతృమూర్తి కథ ఇది. ఒకవైపు ఇద్దరు పసి పిల్లల ఆలనాపాలన.. మరోవైపు కుటుంబ పోషణ కోసం ఉద్యోగం.. ఈ రెండింటి మధ్య సమతుల్యం పాటిస్తూ తన జీవితాన్ని ముందుకు నడిపిస్తోంది నిర్మల్‌కు చెందిన అశ్వినిగణేశ్. చేతిలో చీపురు పట్టుకుని వీధులు ఊడ్చకపోయినా.. చెత్త సేకరించే మున్సిపల్ వాహనానికి స్టీరింగ్ పట్టుకుని నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే బాధ్యతను భుజాన వేసుకుంది.

బిడ్డలే లోకం.. బాధ్యతలే బతుకు బాట!

తెల్లవారుజామునే అశ్వినిగణేశ్ దినచర్య ప్రారంభమవుతుంది. ఇంట్లో ఇద్దరు చిన్నారులు.. వారిని వదిలి వెళ్లలేని పరిస్థితి. మరోవైపు పని చేయకపోతే కుటుంబాన్ని పోషించలేని ఆర్థిక అవసరం. ఈ రెండు బాధ్యతల మధ్య ఆమె ఎంచుకున్న మార్గం మాత్రం ఎంతో ప్రత్యేకం. పిల్లలను ఇంట్లో వదిలేసి వెళ్లడం కంటే తనతో పాటే తీసుకెళ్లాలని నిర్ణయించుకుంది. మున్సిపల్ చెత్త సేకరణ వాహనంలోనే ఇద్దరు చిన్నారులను కూర్చోబెట్టుకుని విధులకు బయలుదేరుతుంది. ఒకవైపు పిల్లలపై కన్నేసి ఉంచుతూనే మరోవైపు వాహనం స్టీరింగ్ తిప్పుతూ తన విధులను నిర్వర్తిస్తోంది.

చెత్త సేకరణలోనూ చెరగని చిరునవ్వు!

నిర్మల్ జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్, రవినగర్, గొల్లపేట్, రెడ్డి కాలనీ, దివ్యనగర్ తదితర ప్రాంతాల్లో ఇల్లిల్లూ తిరుగుతూ చెత్త సేకరిస్తోంది. మున్సిపల్ కాంట్రాక్టర్ అందించిన వాహనంతో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. రోజంతా రోడ్లపై ప్రయాణం.. ఎండ, వానను లెక్కచేయని విధులు.. అయినా ముఖంలో మాత్రం చెరగని చిరునవ్వు. అయితే ఆమె ప్రయాణం వెనుక ఎన్నో కష్టాలు, మరెన్నో బాధ్యతలు దాగి ఉన్నాయి.

అమ్మతనానికి.. ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనం..

సాధారణంగా ఉద్యోగం చేసే తల్లులు పిల్లలను ఇంట్లో కుటుంబసభ్యుల వద్ద వదిలి వెళ్తుంటారు. కానీ అశ్వినికి అలాంటి అవకాశం లేకపోవడంతో పిల్లలను తనతోనే తీసుకెళ్తుంది. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ విధులను కొనసాగిస్తుంది. కుటుంబ బాధ్యతలను తప్పించుకోకుండా, పరిస్థితులకు తలవంచకుండా తన కాళ్లపై తాను నిలబడేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయాణం కేవలం ఉపాధి కోసం సాగుతున్న ప్రయాణం మాత్రమే కాదు.. ఇద్దరు బిడ్డల భవిష్యత్తు కోసం ఓ తల్లి చేస్తున్న పోరాటం. చెత్తను సేకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఆమె.. తన జీవితంలో ఎదురైన కష్టాలను కూడా ధైర్యంతో అధిగమిస్తోంది. ఎంతోమంది తమ సమస్యలకు నిరాశ చెందుతుంటే.. అశ్విని మాత్రం సమస్యలనే సవాళ్లుగా స్వీకరిస్తుంది. ఆమె చేతిలోని స్టీరింగ్ కేవలం ఓ వాహనాన్ని నడిపించడం లేదు.. ఇద్దరు చిన్నారుల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తోంది. తన పిల్లల భవిష్యత్తును మాత్రం బంగారంలా తీర్చిదిద్దాలన్నదే ఆమె ఆశయం. కష్టాలు ఎన్ని ఎదురైనా.. అమ్మతనం ముందు అవన్నీ చిన్నవేనని నిరూపిస్తున్న అశ్వినికి నిజంగా సెల్యూట్ చేయాల్సిందే.

Follow Us
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!
నామినేషన్‌కు గుర్రాలపై ఎంట్రీ.. గబ్బర్ సింగ్‌ను తలపిస్తూ హంగామా!
13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం..
13 సిక్సర్లు, 8 ఫోర్లతో ఊహించని విధ్వంసం..