AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఆయన సరసన నటించిన ప్రతి హీరోయిన్ స్టార్ అయ్యారు.. ఇండస్ట్రీలోనే తోపు నటుడు..

బహుముఖ నటుడు చంద్రమోహన్ సినీ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా, విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను అలరించారు. అగ్రశ్రేణి నటుల ప్రశంసలు అందుకుంటూ, ఎన్నో కష్టాలను అధిగమించి ఐదు దశాబ్దాలపాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన ప్రయాణంలోని ఆసక్తికర విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

Tollywood : ఆయన సరసన నటించిన ప్రతి హీరోయిన్ స్టార్ అయ్యారు.. ఇండస్ట్రీలోనే తోపు నటుడు..
Actor Chandramohan
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2026 | 5:17 PM

Share

దివంగత సీనియర్ నటుడు చంద్రమోహన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన సినీ ప్రస్థానం ఎత్తుపల్లాలతో, పట్టుదలతో కూడుకున్న ఒక మహత్తర ప్రయాణం. ఆయన హీరో పాత్రలకే పరిమితం కాకుండా, విలన్, కమెడియన్, తమ్ముడు, బావ, తండ్రి, తాత వంటి అన్ని రకాల పాత్రలను పోషించి బహుముఖ నటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. వ్యవసాయ శాఖలో ఉద్యోగం చేస్తున్న ఆయనను బి.ఎన్. రెడ్డి ఆర్టిస్ట్ గా ఎంపిక చేసి చంద్రమోహన్ అని పేరు మార్చారు. బి.ఎన్. రెడ్డి స్వయంగా ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్లి పరిచయం చేయగా, ఎన్టీఆర్ “మా బి.ఎన్. గారి పేరు నిలబెట్టాలి బ్రదర్” అని ఆశీర్వదించారు. ఆరు నెలల పాటు ఎన్టీఆర్ షూటింగ్‌లకు వెళ్లి ఆయన నటనను పరిశీలించి, సందేహాలు అడిగి తెలుసుకున్నారు చంద్రమోహన్.

రంగులరాట్నం చిత్రం విడుదలై మంచి పేరు, బంగారు నంది అవార్డు తెచ్చినా, ఆ తర్వాత వెంటనే అవకాశాలు రాలేదు. ఉద్యోగం వదులుకోవడంతో భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. ఒకానొక సందర్భంలో, అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి వద్ద సినిమాల్లో అవకాశాలు రాకపోతే మళ్లీ ఉద్యోగం వేయించాలని అడిగారు. కాసు బ్రహ్మానందరెడ్డి నవ్వి, బి.ఎన్. రెడ్డి పరిచయం చేసిన నటుడివి తప్పకుండా పైకి వస్తావు అని ఆశీర్వదించారు. ఆ తర్వాత కొన్ని చిత్రాలు చేసినా, దాదాపు రెండేళ్లపాటు వేషాలే లేవు. దర్శకుడు బి.ఎన్. రెడ్డి హీరో తప్ప ఇతర పాత్రలు చేయవద్దని చెప్పడంతో, చిన్నచిన్న వేషాలను కూడా నిరాకరించారు. ఇంటి నుండి డబ్బు తెప్పించుకోవడానికి మొహమాటపడి, మద్రాసు టి.నగర్ లోని వెంకట నారాయణ రోడ్డు పార్కులో మంచి నీళ్లు తాగి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. మద్రాసు వదిలి ఇంటికి తిరిగి వెళ్ళిపోవాలని అనుకున్నారు కానీ, పట్టుదల పెరిగి చావో రేవో ఇక్కడే తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

హీరోగా నటించాలనే తన పట్టుదలని సడలించుకున్నారు. ఈ విషయంలో శోభన్ బాబు సలహా కూడా చంద్రమోహన్ పై ప్రభావం చూపింది. అప్పటి నుంచి కృష్ణ, శోభన్ బాబు పక్కన నటించే అవకాశం వస్తే వదులుకునేవారు కాదు. బంగారు పంజరం చిత్రంలో తనకు పాత్ర లేదని బి.ఎన్. రెడ్డి చెప్పినా అధైర్యపడలేదు. ఇంటి గౌరవం, ఇంటి కోడలు చిత్రాల్లో చిన్న పాత్రలైనా అంగీకరించారు. 1973లో ఆయన దగ్గరి బంధువైన దర్శకుడు కె. విశ్వనాథ్ ఓ సీత కథ చిత్రంలో చంద్రమోహన్ కు హీరో పాత్ర ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన నట జీవితం మలుపు తిరిగింది. అమ్మాయిల శపధం, బొమ్మా బొరుసా, సంసారంలో సరిగమలు, జరుగుతున్న కథ, లక్ష్మణరేఖ, భారతంలో ఒక అమ్మాయి వంటి చిత్రాలు ఆయనను నటుడిగా నిలబెట్టాయి.

1976లో వచ్చిన సిరిసిరిమువ్వ చిత్రంలోని సాంబయ్య పాత్ర ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చింది. “పర్సనాలిటీ, ఎత్తు సరిపోవు” అన్న వ్యాఖ్యలను ఈ చిత్రం తిరస్కరించింది. సినిమా సూపర్ హిట్ అయ్యి ఆయన్ని హీరోగా నిలబెట్టింది. వెంటనే వచ్చిన 16 ఏళ్ల వయసు చిత్రంతో మరింత బిజీ అయ్యారు. చంద్రమోహన్ పక్కన తొలిసారిగా నటించిన 60 మందికి పైగా హీరోయిన్లు ఆ తర్వాత టాప్ స్టార్స్ అయ్యారు. శ్రీదేవి, జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధిక, వాణిశ్రీ వంటి ఎందరికో ఆయనే తొలి హీరో. అయితే, వీరిలో జయసుధ తన ఫేవరెట్ అని చంద్రమోహన్ చెబుతారు, వీరిద్దరూ 34 చిత్రాల్లో కలిసి నటించారు.

నటనలో ఎస్.వి. రంగారావును ఆదర్శంగా తీసుకునే చంద్రమోహన్, ఆయనతో కలిసి సుఖదుఃఖాలు చిత్రంలో నటించారు. అక్కినేని నాగేశ్వరరావు చిత్రాల్లో తమ్ముడిగా, కొడుకుగా, స్నేహితుడిగా, అల్లుడిగా పలు పాత్రలు పోషించారు. ఐదు దశాబ్దాల నటజీవితంలో సుమారు 800 చిత్రాల్లో నటించారు చంద్రమోహన్. పాత తరం ప్రేక్షకులను హీరో పాత్రలతో, యువ తరం ప్రేక్షకులను తండ్రి, అన్న, తాత పాత్రలతో అలరించారు. హీరో పాత్రలు వేసే వయసు దాటిపోవడంతో, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కలికాలం చిత్రంలో తొలిసారిగా తండ్రి పాత్ర పోషించారు. ఎంతో ప్రతిభ, సుదీర్ఘమైన నట జీవితం ఉన్నా, ఆయనకు పద్మ అవార్డులు, గౌరవ డాక్టరేట్‌లు రాకపోవడం విచారకరం. అయితే, చంద్రమోహన్ మాత్రం “ప్రేక్షకుల అభిమానం చాలు” అంటూ వినమ్రంగా చెబుతారు. ఆయన భార్య జలంధర మంచి రచయిత్రి, వారికి ఇద్దరు ఆడపిల్లలు.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: ఏం ట్విస్టులు రా బాబూ.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ట్రెండింగ్‏లో నంబర్ వన్..

చంద్రమోహన్..

Actor Chandramohan Movies

Actor Chandramohan Movies

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది భయ్యా ఈ సాంగ్.. చిరంజీవి, విజయశాంతి కాంబో.. థియేటర్లను ఓ ఊపు ఊపేసింది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఆ హీరో సరసన నటించిన ప్రతి హీరోయిన్ స్టార్ అయ్యేవారు..
ఆ హీరో సరసన నటించిన ప్రతి హీరోయిన్ స్టార్ అయ్యేవారు..
పాక్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న తెలుగు కుర్రాడు
పాక్‌ క్రికెట్ ఫ్యాన్స్‌కు నిద్రలేకుండా చేస్తున్న తెలుగు కుర్రాడు
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
చెత్త వాహనమే బతుకు బండి.. బిడ్డల కోసం తల్లి జీవనపోరాటం..
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఇంటిపై సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవాలా? ప్రభుత్వం శుభవార్త
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
ఓటీటీలో అస్సలు మిస్ కావద్దు.. మలయాళ మూవీస్ ఇచ్చే అసలైన కిక్ ఇదే..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
వైకుంఠ చతుర్దశి ఎప్పుడు? విష్ణుమూర్తి, శివుడిని ఒకేరోజు ఎందుకు..
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
విడాకుల ఖరారుతో ఇంట్లోకి పంది పిల్ల.. మాజీ భర్తకు మహిళ కౌంటర్!
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
అమ్మమ్మ చేసే కమ్మని నెయ్యి సున్నుండలు.. ఇట్టే కరిగిపోతాయి
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
శాలరీలో పీఎఫ్ కట్ చేసినా మీ అకౌంట్లో వేయలేదా..? ఇలా చేస్తే చాలు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..
ముసుగులో ఉన్నోడు మాములోడు కాదు..