ధోనితో బ్రేకప్ చేసుకున్న టాలీవుడ్ బ్యూటీ ఎవరో తెలుసా.. కారణం అదే !!!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆయన.. రీసెంట్ గానే తన సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణానికి కూడా వీడ్కోలు పలికారు. ఈ క్రమంలోనే ధోనీ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి.

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరు చాలు ఒక జనరేషన్ మొత్తం అభిమానంతో ఊగిపోద్ది. భారత క్రికెట్ చరిత్రలో ‘కెప్టెన్ కూల్’ గా ముద్ర వేసుకున్న ఈ ఛాంపియన్‌ది ఒక సువర్ణాధ్యాయం. అద్భుతమైన కెప్టెన్‌గా.. అసాధ్యాలను సుసాధ్యం చేసే బెస్ట్ ఫినిషర్‌గా.. మెరుపు వేగంతో స్టంపింగ్ చేసే వికెట్ కీపర్‌గా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. జట్టు సారధిగా 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించి చరిత్ర సృష్టించారు. అలానే మరోవైపు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సారథిగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందించారు. అయితే 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతూ వస్తున్నారు. అయితే అనూహ్యంగా తన సుదీర్ఘ ఐపీఎల్ ప్రయాణానికి కూడా ధోని వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
కాగా ధోనీ క్రికెట్ కెరీర్, పర్సనల్ లైఫ్ లను రెండింటిని కొంత మేర కవర్ చేసేలా “ధోని” బయోపిక్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో తన ప్రేమ వ్యవహారాల గురించి కూడా ప్రస్తావించారు. తన మొదటి ప్రేయసి మరణం.. ఆ తర్వాత సాక్షి పరిచయం, ప్రేమ, పెళ్లి వంటి ఘటనలను అందులో చూడొచ్చు. అయితే ధోని క్రికెట్ కెరీర్ తొలినాళ్లల్లో కొన్ని లవ్ ట్రాక్‌లు నడిచిన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. వాటిలో సంవత్సరం పాటు ఆయనతో రిలేషన్‌షిప్‌లో ఉండి బ్రేకప్ చెప్పిన టాలీవుడ్ బ్యూటీ ఒకరు ఉన్నారని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఆ హీరోయిన్ ఎవరు ? ఎందుకు బ్రేకప్ అయ్యిందో మీకోసం ప్రత్యేకంగా..
ఎవరా బ్యూటీ..?
గతంలో ధోనితో రిలేషన్‌షిప్‌లో ఉన్న బ్యూటీ ఎవరో కాదు.. తమిళ, తెలుగు ఇండస్ట్రీస్‌లో మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రాయ్ లక్ష్మీ. కర్ణాటకలో జన్మించిన ఈ భామ చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. కాంచనమాల కేబుల్ టీవి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాంచన సినిమాతో మంచి బ్రేక్ దక్కించుకుంది. అలానే సర్దార్ గబ్బర్ సింగ్, ఖైదీ నెం 150 సినిమాలతో మెగా హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ప్రస్తుతం పలు భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.
బ్రేకప్ కారణం అదేనా..?
రాయ్ లక్ష్మీ గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2008 ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు సారథిగా ధోని ఉన్న సమయంలోనే డేటింగ్‌లో ఉన్నట్లు ఆమె పేర్కొంది. సంవత్సరం పాటు రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత తాము సామరస్యంగా విడిపోవాలని అనుకున్నట్లు స్పష్టం చేసింది. ఎలాంటి గొడవలు లేకుండా బ్రేకప్ చెప్పుకొన్నట్లు వెల్లడించింది. అయితే బ్రేకప్ జరిగినా తమకు ఒకరిపై మరొకరికి రెస్సెక్ట్ ఉందని.. ధోని తర్వాత కూడా తన జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయని ఓపెన్ అయ్యింది. కానీ ఆ విషయాల గురించి తానెప్పుడూ బాధ పడలేదని తెలిపింది.
